షమీ అరెస్ట్ పై రెండు నెలలు స్టే

భారత క్రికెట్ ప్లేయర్ మహ్మద్ షమీని అరెస్టు చేయకుండా రెండు నెలల పాటు స్టే విధించింది పశ్చిమ బెంగాల్ అలీపోర్ కోర్టు. ఈ విషయాన్ని షమీ తరపు న్యాయవాది సలీమ్ రెహ్మాన్ తెలిపారు.

గృహ హింస కేసులో షమీకి అరెస్ట్ వారెంట్ జారీ అయింది. విండీస్ టూర్ నుంచి తిరిగి వచ్చిన 15 రోజుల్లోపు లొంగిపోవాలంటూ పశ్చిమ బెంగాల్ అలీపోర్ కోర్టు షమీని ఆదేశించింది. గతేడాది షమీ భార్య హసీన్ జహాన్ అతనిపై కేసు పెట్టింది. అయితే… కోర్టు వాయిదాలకు షమీ హాజరుకాకపోవడంతో… అతనికి అరెస్ట్ వారెంటును జారీ చేసింది కోర్టు. ఈ క్రమంలో షమీకి కోర్టు స్వల్ప ఊరటను కలిగించింది. తదుపరి విచారణ నవంబర్ 2న జరగనుందని సలీమ్ రెహ్మాన్ తెలిపారు.

Latest Updates