పరువు నష్టం కేసులో రాహుల్ కు కోర్టు సమన్లు

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీహార్ డిప్యూటి సీఎం సుశీల్ మోడీ పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో రాహుల్ కు పాట్నా కోర్టు సమన్లు జారీ చేసింది. మే 20న కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. కాగా, మహారాష్ట్రలో ఇటీవల నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ‘మోడీ’ అనే ఇంటి పేరు ఉన్న వారిని రాహుల్ అవమానించారని ఆరోపిస్తూ పాట్నా కోర్టులో క్రిమినల్ కంప్లయిట్ నిన్న(శుక్రవారం)దాఖలు చేశారు. ఈ ఆరోపణలపై కోర్టు విచారణ జరిపి రాహుల్ కు ఇవాళ సమన్లు జారీ చేసింది.

 

Latest Updates