ధ‌ర్మానికి, న్యాయానికి ప్ర‌తీక‌గా కోర్టు తీర్పు: డీకే అరుణ

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కోర్టు తీర్పును స్వాగ‌తిస్తున్నామన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ధ‌ర్మానికి, న్యాయానికి ప్ర‌తీక‌గా కోర్టు తీర్పు వ‌చ్చిందన్నారు. ఒక వైపు రామాల‌య నిర్మాణం…మ‌రో వైపు 28 ఏళ్లుగా సాగుతున్న కేసు ప‌రిష్కారం జ‌ర‌గ‌డం పై ఆనందం వ్య‌క్తం చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, రాజకీయ పక్షపాతంతో బీజేపీ నేతలపై, సాధువులు, వీహెచ్‌పీ నేతలపై కాంగ్రెస్ తప్పుడు కేసులు వేసిందని …కుట్ర పూరితంగా కూల్చివేత జ‌ర‌గ‌లేద‌ని కోర్టు తీర్పు ఇవ్వ‌డంతో బీజేపీ వాద‌న నిజ‌మైందన్నారు. ఇప్ప‌టికైన ఆయా పార్టీలు మ‌త రాజ‌కీయాలు మానుకోవాలని సూచించారు. కుట్రలో పాల్గొన్న వారు దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు డీకే అరుణ.

Latest Updates