కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు వలంటీర్ల నమోదు పూర్తి

భారత్ లో అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన కరోనా వ్యాక్సిన్లలో కొవాగ్జిన్ ఒకటి. హైదరాబాదుకు చెందిన భారత్ బయోటెక్ సంస్థ ICMR తో కలిసి సంయుక్తంగా ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది. ఇప్పటికే మొదటి రెండు దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాగా… ప్రస్తుతం కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ప్రయోగాల దశలో ఉంది. లేటెస్టుగా ఈ మూడో దశ ప్రయోగాల కోసం వలంటీర్ల నమోదు ప్రక్రియ పూర్తయిందని భారత్ బయోటెక్ తెలిపింది.

మూడో దశ క్లినికల్ ప్రయోగాల కోసం తాము 26  వేల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని భావించామని… అయితే 25,800 మంది వలంటీర్లు ముందుకొచ్చారని భారత్ బయోటెక్ చెప్పింది. వ్యాక్సిన్  అభివృద్ధి చేసే క్రమంలో తమకు సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపింది భారత్ బయోటెక్ .

 

Latest Updates