రాష్ట్రంలో కొత్తగా 975 కరోనా కేసులు నమోదు

రాష్ట్రంలో సోమవారం  కొత్త‌గా 975 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. 861 కొత్త కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో నమోదు కాగా, రంగారెడ్డిలో  40, మేడ్చల్ లో 20 మందికి  కరోనా సోకినట్లు తేలింది. మిగిలిన ప్రాంతాలైన నల్గొండ – 2, సంగారెడ్డి  -14, భద్రాద్రి కొత్తగూడెం – 8, కరీంనగర్ -10, సిద్ధపేట -1, వరంగల్ అర్బన్ – 4, మహబూబ్ నగర్  -3, అసిఫాబాద్ -1, గద్వాల్ -1, వరంగల్ రూరల్ – 5, మహబూబాబాద్ – 1, కామారెడ్డి – 2, యాదాద్రి – 2 కేసులు నమోదయ్యాయి. దీంతో  రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 15,394 కి చేరింది. ఈ రోజు కరోనాతో ఆరుగురు మృతి చెందగా..ఇప్పటి వరకు కరోనా సోకి మృతి చెందిన వారి సంఖ్య  253కి చేరింది.

Latest Updates