మెడికోల కోసం గౌన్లు త‌యారు చేయ‌బోతున్న ఖైదీలు

  • రెడీ అంటున్న పూజప్పుర జైలు ఖైదీలు

తిరువనంతపురం: కరోనా రోగులకు సేవలందిస్తున్న మెడికోల కోసం భారీ మొత్తంలో ఫేస్ మాస్కులను తయారు చేసిన కేరళలోని పూజప్పుర సెంట్రల్ జైలు ఖైదీలు ఇప్పుడు మరో పనికి సిద్ధమయ్యారు. కరోనాతో అత్యవసర పరిస్థితులు నెలకొనడంతో గౌన్లకు బాగా డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో డాక్టర్లతోపాటు పారా మెడికల్ సిబ్బందికి అవసరమైన గౌన్లను రూపొందించడానికి పూజప్పుర జైలు ఖైదీలు రెడీ అవుతున్నారు. ఇప్పటికే శ్రీ చిత్ర తిరునాల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ నుంచి 500 గౌన్లతోపాటు యూనిఫామ్స్ తయారు చేయాల్సిందిగా ఈ జైలుకు ఆర్డర్ అందింది. ఈ జైలులో శానిటైజర్స్ ను కూడా తయారు చేస్తున్నారు. పూజప్పుర జైలుతోపాటు కేరళలో మరో 55 జైళ్లలో ఖైదీలు మాస్కులతోపాటు శానిటైజర్లను తయారుచేస్తున్నారు

Latest Updates