పరిశోధనల్లో తప్పులు..90శాతం పనిచేస్తున్న కరోనా వ్యాక్సిన్

కరోనా వైరస్‌ కట్టడికి ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా తయారు చేసిన వ్యాక్సిన్ లో మిస్టేక్ జరిగినట్లు  ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ పేర్కొంది. అందుకే మూడో దశ హ్యూమన్ ట్రయల్స్ లో రెండు డోసులకు బదులు ఒకటిన్నర డోసుతోనే పరీక్షలను నిర్వహించినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ ట్రయల్స్ ప్రకారం తక్కువ డోసేజీ ఇచ్చిన కేసులలో  అధికంగా 90 శాతం ఫలితాలు నమోదైనట్లు ఆస్ట్రాజెనెకా మరోసారి వెల్లడించింది. లోయర్‌ డోసేజీవల్ల రోగనిరోధక శక్తిని పెంచే టీసెల్స్‌ మరింత సమర్థవంతంగా పనిచేసి, కరోనా వ్యాక్సిన్ మంచి ఫలితాలు రాబట్టిందని సైంటిస్టులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

Latest Updates