మ్యాక్స్ హాస్పిటల్​లో 33 మందికి వైరస్

న్యూ ఢిల్లీ: మ్యాక్స్ హాస్పిటల్​లో డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందితో సహా మొత్తం 33 మందికి కరోనా పాజిటివ్ కన్ఫామ్ అయిందని ఆస్పత్రి వర్గాలు సోమవారం వెల్లడించాయి. వీరిలో ఇద్దరు డాక్టర్లు, 23 మంది నర్సింగ్ సిబ్బంది, మిగతావారు టెక్నికల్, సపోర్టింగ్ స్టాఫ్ గా పనిచేస్తున్నారు. మ్యాక్స్ హెల్త్ కేర్ గ్రూప్ లో పనిచేస్తున్న హెల్త్, నాన్ మెడికల్ సిబ్బందికి మేనేజ్​మెంట్ రెండు వారాల కిందటి నుంచి కరోనా టెస్టులు చేయడం ప్రారంభించింది. ఈ మేరకు సోమవారం నాటికి 33 మంది వైరస్ బారిన పడినిట్లు వెల్లడించింది. బాధితులందరినీ దక్షిణ ఢిల్లీలోని మ్యాక్స్ హాస్పిటల్ ఈస్ట్ బ్లాక్‌ లో ఐసోలేషన్ కు తరలించినట్లు తెలిపింది. ఇంత‌కు ముందే ఇదే హాస్పిట‌ల్‌లో 145 మంది న‌ర్సుల‌ను 14 రోజుల పాటు క్వారెంటైన్ చేశారు. మొత్తం హాస్టల్ కాంప్లెక్స్‌ను సీజ్ చేసి కంటైన్​మెంట్ జోన్‌గా ప్రకటించారు.

 

Latest Updates