‘కిరోసిన్‌తో కరోనా న‌యం చేస్తా..’ వ్య‌క్తి అరెస్ట్

తిరువనంతపురం : కిరోసిన్‌తో కరోనా వ్యాధిని న‌యం చేయొచ్చని ప్రచారం చేసిన ఓ వ్యక్తిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. కేరళలోని పెరిన్‌థల్మాన్నాకు చెందిన రోనాల్డ్‌ డేనియల్‌(64) అనే వ్య‌క్తి .. కరోనా సోకిన వారు 11 రోజుల పాటు కిరోసిన్‌ తాగితే ఆ వైరస్‌ చనిపోతుందని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించాడు. తనకు అవకాశం ఇస్తే వైరస్ బారి నుండి‌ ప్రజలను కాపాడతానని ప్రచారం చేశాడు. దీనిపై కేరళ సీఎంకు కూడా ఓ మెయిల్ పెట్టాడు. కిరోసిన్‌తో కరోనాను నయం చేస్తానని, కిరోసిన్‌ తాగడం వల్ల మనిషి శరీరానికి ఎలాంటి హాని సంభవించదని త‌న మెయిల్‌లో పేర్కొన్నాడు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. క‌రోనా వైర‌స్ విష‌యంలో ఎవరైనా ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే.. కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Latest Updates