దేశంలో 50 లక్షల మంది రికవరీ

దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతోంతి. నిన్న ఒక్కరోజే 82,170 కరోనా కేసులు నమోదవ్వగా..1039 మంది చనిపోయారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 60,74,703 కు చేరగా.. మరణాల సంఖ్య 95,542 కు చేరింది. నిన్న ఒక్కరోజే 74,893 మంది కరోనా నుంచి కోలుకోగా ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 50,16,521 కు చేరింది. ఇంకా 9,62,640 మంది  ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 709394 కరోనా టెస్టులు చేయడంతో  దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 27 నాటికి 7,19,67,230 కు చేరిందని ఐసీఎంఆర్ ప్రకటించింది.

 

 

 

Latest Updates