దేశంలో 20 వేలు దాటిన క‌రోనా కేసులు, 652 మంది మృతి

దేశంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ‌బుధవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా కొత్తగా 1,486 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య దేశంలో 20,471కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 49 మంది మ‌ర‌ణించారు. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు కరోనా వైరస్ సోకి మొత్తం 652 మృతి చెందినట్టు ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 15859 యక్టీవ్ కేసులు ఉండ‌గా.. క‌రోనా బారిన ప‌డి చికిత్స పొంది, డిశ్చార్జ్ అయిన వారు 3960 మంది.

దేశంలో 60 శాతానికి పైగా కేసులు మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ, రాజస్థాన్‌, తమిళనాడు ఈ ఐదు రాష్ర్టాల్లోనే నమోదయ్యాయి. మ‌హారాష్ట్ర‌లోని ముంబయి 3 వేల కేసులతో టాప్‌లో కొనసాగుతుండగా తర్వాతి స్థానాల్లో ఢిల్లీ-2,081, అహ్మదాబాద్‌-1,298, ఇండోర్‌-915, పూణె-660, జైపూర్‌లో 537 కేసులు నమోదయ్యాయి. క‌రోనా క‌ట్ట‌డి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు లాక్ డౌన్ ను ప‌టిష్టంగా అమ‌లు చేస్తున్నాయి. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ‌రానున్న సోమవారం(ఈ నెల 27న‌) అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

Latest Updates