న‌గ‌రంలో ఆ వ‌య‌సు వారిలోనే క‌రోనా కేసులు ఎక్కువ‌

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ కోసం ప్ర‌యోగాలు నిర్విరామంగా కొన‌సాగుతున్నాయి. ప్ర‌తీనెల క‌రోనా సంబంధించి ఏదో అంశంపై సైంటిస్ట్ లు ప్ర‌యోగాలు చేస్తున్నారు. ఆ ప్ర‌యోగాల్లో భాగంగా వైర‌స్ ప్రారంభంలో 60ఏళ్ల కు పై బ‌డిన‌వారికి, చిన్న‌పిల్ల‌ల‌కు వైర‌స్ సోకే ప్ర‌మాదం ఎక్కువ‌గా ఉంద‌ని తేలింది.

తాజాగా హైద‌రాబాద్ లో ఈ త‌ర‌హా ప‌రిశోధ‌న‌లు జ‌రిగాయి. ఏ వ‌య‌సు వారికి క‌రోనా సోకే ప్ర‌మాదం ఉంద‌ని అధికారులు ఆరాతీయ‌గా.. 21-50 సంవత్సరాల వయస్సు వారిలో కేసుల సంఖ్య వేగంగా పెరిగిందని ఆరోగ్య‌శాఖ అధికారులు ధృవీకరించారు.

21-50 సంవత్సరాల వయస్సులో క‌రోనా అధికంగా ఉంది. అవ‌స‌ర‌మైతే త‌ప్పా బ‌హిరంగ ప్ర‌దేశాల్లో తిర‌గొద్దంటూ ప్రభుత్వం ప్రకటన విడుద‌ల చేసిన‌ట్లు టైమ్స్ న్యూస్ నౌ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది.

ఆ క‌థ‌నం ప్ర‌కారం 21-50 ఏళ్ళ వయస్సు వారిలో క‌రోనా సోకుతున్న‌ట్లు గుర్తించామ‌ని, ఆదేశాల‌కు అనుగుణంగా ప్ర‌తీ ఒక్క‌రూ జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని ప్ర‌భుత్వం తెలిపింద‌ని ఆ క‌థ‌నంలో పేర్కొంది. న‌గ‌రంలో న‌మోదైన క‌రోనా బాధితుల్లో 75శాతం ఆ వ‌య‌సు వారే ఎక్కువ‌ని తెలిపింది.

Latest Updates