సీక్రెట్‌‌గా వేల మందిపై వ్యాక్సిన్ ప్రయోగం! 

బీజింగ్: కరోనా వ్యాక్సిన్‌‌‌ను రూపొందించే పనుల్లో చాలా దేశాలు బిజీగా ఉన్నాయి. పలు దేశాల్లో వ్యాక్సిన్ ట్రయల్స్ కీలక దశల్లో ఉన్నాయి. రష్యా స్పుత్నిక్ వీ పేరుతో వ్యాక్సిన్‌‌ను తీసుకొచ్చింది. కరోనాకు పుట్టినిల్లుగా చెబుతున్న చైనా కూడా వ్యాక్సిన్ పనులను వేగవంతం చేసింది. అయితే చైనాలో వ్యాక్సిన్‌‌ ట్రయల్స్‌‌ నిర్వహిస్తున్న తీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. చైనాలో తయారు చేస్తున్నవ్యాక్సిన్ ట్రయల్స్ దశలో ఉన్నప్పుడే, నిర్థారణ కాకముందే సీక్రెట్‌‌గా వేల మందిపై ప్రయోగించారని తెలిసింది. వ్యాక్సినేషన్ చేయించుకున్న వాళ్లతో ప్రయోగం గురించి బయటకు చెప్పకుండా నాన్‌‌డిస్‌‌క్లోజర్ అగ్రిమెంట్‌‌పై సంతకాలు చేయించుకున్నారని తెలుస్తోంది.

హైరిస్క్ ఉన్న జనాభాతోపాటు  ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, వ్యాక్సిన్ కంపెనీ స్టాఫ్‌‌తోపాటు టీచర్లకు ఇప్పటికే టీకాలు వేశారని సమాచారం. వ్యాక్సినేషన్‌‌కు ముందు వారి ఆమోదం తీసుకున్నారా లేదా అనే దానిపై గ్లోబల్ హెల్త్ ఎక్స్‌‌పర్ట్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చైనాలో 11 వ్యాక్సిన్‌‌లు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయి. వీటిలో నాలుగు ఫేజ్ 3 ట్రయల్స్‌‌లో ఉన్నాయి. ఈ నాలుగు వ్యాక్సిన్స్‌‌లో రెండింటిని చైనా నేషనల్ బయోటెక్ గ్రూప్, సినోవక్ బయోటెక్ రూపొందిస్తోంది. మరో వ్యాక్సిన్‌‌ను చైనా మిలటరీ అప్రూవ్ చేసిన క్యాన్సినో బయోలాజిక్స్ తయారు చేస్తోంది.

Latest Updates