బ్రిటీన్ సర్వే: యూఎస్ లో 22లక్షలు,యూకేలో 5 లక్షల మంది చనిపోతారేమో

కరోనా వైరస్  వల్ల యూఎస్ లో 22లక్షమంది యూకేలో 5లక్షల మంది మరణించే అవకాశం ఉందని బ్రిటన్ కు చెందిన ఇంపీరియల్ కాలేజీ మ్యాథ మెటిక్స్ బయాలజీ ప్రొఫెసర్ నీల్ ఫెర్గూసన్ బృందం తెలిపింది. నీల్ ఫెర్గూసన్ బృందం ఇటలీ నుండి కరోనా వైరస్ మరణాల స్థితిగతులపై ఓ డేటాను సేకరించింది. ఆ డేటా ఆధారంగా వారం రోజుల్లో వైరస్ ప్రభావం పెరిగినట్లు గుర్తించారు. కరోనా వైరస్ ను 1918లో ప్రభలిన ఫ్లూవైరస్ తో పోల్చిచూస్తే..ఫ్లూ   కంటే కరోనా ప్రమాదాకరమని నిర్ధారించారు. కరోనా ను అరికట్టేందుకు వ్యాక్సిన్ లేకపోవడం వల్ల బ్రిటన్ లో 5 లక్షల మంది, యూఎస్ లో 2.2లక్షల మంది మరణించే అవకాశం ఉన్నట్లు ఫెర్గూసన్ బృందం సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు.

వైరస్ ను ఎలా అరికట్టవచ్చు

క్లబ్బులు, పబ్బులు, థియేటర్ల తో పాటు పబ్లిక్ ప్లేసుల్లో ఎక్కువ మంది గుమిగూడ కుండా ఉండేలా జాగ్రత్త పడితే వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చని అన్నారు.

ఆర్ధికంగా దెబ్బదీస్తుంది

వైరస్ సమాజాన్ని ఆర్ధికంగా దెబ్బతీస్తూ భారీ ఒత్తిడి గురి చేస్తుందని  ఫెర్గూసన్‌తో కలిసి పనిచేసిన ఇంపీరియల్‌ అంటు వ్యాధి ఎపిడెమియాలజీ ప్రొఫెసర్ అజ్రాఘని అన్నారు.

Latest Updates