కరోనా సీరియస్​ వ్యాధి కాదు

న్యూఢిల్లీ: కరోనా సీరియస్​ డిసీజ్​ కాదని, ఈ వైరస్​ బారిన పడిన వారిలో 90 నుంచి 95 శాతం మంది కోలుకుంటున్నారని ఎయిమ్స్​ చీఫ్ డాక్టర్​ రణదీప్​ గులేరియా చెప్పారు.  కరోనాను అంత సీరియస్​గా తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన  గురువారం చెప్పారు.  చాలా మంది పేషెంట్లు కరోనా లేదా ఫ్లూ సింప్టమ్స్​ ఉన్నా హాస్పిటల్స్​కు రావడం లేదని చెప్పారు. ఇదే పరిస్థితి కొనసాగితే ట్రీట్​మెంట్​ అందించడంలో ఆలస్యం జరిగి మరణాల సంఖ్య పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మెజారిటీ కరోనా పేషెంట్లకు సపోర్టివ్​ ట్రీట్​మెంట్​ సరిపోతోందని, 15 శాతం మందికి మాత్రమే ఆక్సిజన్​ థెరపీ అవసరం అవుతోందని చెప్పారు. ఇప్పటికే మన దేశంలోని హాస్పిటల్స్​లో కరోనా ట్రీట్​మెంట్​ కోసం వివిధ రకాల డ్రగ్స్, కొత్త వ్యాక్సిన్లు, మెడిసిన్లు వాడుతున్నారని, అలాగే కొంత మంది పేషెంట్లకు కన్వాల్సెంట్​ ప్లాస్మా ట్రీట్​మెంట్​ కూడా చేస్తున్నారని, ఇది మంచి రిజల్ట్స్​ ఇస్తోందని డాక్టర్ గులేరియా చెప్పారు.

Latest Updates