దేశమంతటా 20.4 లక్షల కరోనా టెస్టులు

  • 3 లక్షల టెస్టులకు చేరువలో తమిళనాడు టాప్​
  • 2.10 లక్షల టెస్టులతో ఏపీ మూడో ప్లేస్​
  • ఐసీఎంఆర్​–ఎన్​ఐవీ టెస్ట్​ కిట్​ ‘కొవిడ్​ కవచ్​ ఎలీసా’
  • 100% కచ్చితత్వం, 98.7% సెన్సిటివిటీతో పని
  • దేశవ్యాప్తంగా టెస్టుల కోసం కిట్​కు ఓకే చెప్పిన ఐసీఎంఆర్​

న్యూఢిల్లీ: దేశంలో కరోనా టెస్టుల సంఖ్య మరో మైలురాయిని చేరింది. 20 లక్షల మార్కును దాటింది. దేశమంతటా ఇప్పటిదాకా 20 లక్షల 39 వేల 952 శాంపిళ్లను టెస్ట్​ చేశారు. టెస్టుల జాబితాలో తమిళనాడు ముందుండగా, మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. తమిళనాడులో 2,91,432 టెస్టులు చేయగా, మహారాష్ట్రలో 2,40,482 టెస్టులు చేశారు. ఇటు ఏపీలోనూ టెస్టుల సంఖ్య 2 లక్షల మార్కును దాటింది. జాబితాలో మూడో స్థానంలో ఉంది. మొత్తంగా అక్కడ 2,10,452 శాంపిళ్లను ఇప్పటిదాకా పరీక్షించారు. 2,04,243 టెస్టులతో రాజస్థాన్​ నాలుగో స్థానంలో ఉంది. మరో నాలుగు రాష్ట్రాలు లక్షకుపైగా టెస్టులు చేశాయి. ఈ జాబితాలో ఉత్తర్​ప్రదేశ్​ (1,53,139), కర్నాటక (1,28,373) గుజరాత్​ (1,24,708), ఢిల్లీ (1,19,736) ఉన్నాయి.

‘కొవిడ్​ కవచ్​ ఎలీసా’ టెస్ట్​ కిట్​కు ఓకే

పుణేలోని నేషనల్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ వైరాలజీ (ఎన్​ఐవీ) తయారు చేసిన ఐజీజీ ఎలీసా యాంటీబాడీ టెస్ట్​కిట్​కు ‘కొవిడ్​ కవచ్​ ఎలీసా’ అని ఇండియన్​ కౌన్సిల్​ ఫర్​ మెడికల్​ రీసెర్చ్​ (ఐసీఎంఆర్​) పేరు పెట్టింది. వ్యాలిడేట్​ చేసి దానికి ఓకే చెప్పింది. 100% కచ్చితత్వం, 98.7% సెన్సిటివిటీతో ఈ టెస్ట్​ కిట్​ పనిచేస్తోందని వ్యాలిడేషన్​లో తేలినట్టు ఐసీఎంఆర్​ వెల్లడించింది. రెండున్నర గంటల్లో ఒకేసారి 90 శాంపిళ్లను ఈ ఎలీసా కిట్​తో టెస్ట్​ చేయొచ్చని పేర్కొంది. జిల్లా స్థాయిల్లో దీనిని వాడడం చాలా ఈజీ అని పేర్కొంది. ఆర్టీపీసీఆర్​ టెస్ట్​తో పోలిస్తే కొవిడ్​ కవచ్​ ఎలీసాకు బయోసేఫ్టీ, బయోసెక్యూరిటీ అవసరాలు చాలా తక్కువని చెప్పింది. వీటిని ఎక్కువ మొత్తంలో తయారు చేయడానికి స్పాన్​, జే మిత్ర, జైడస్​ క్యాడిలా, సిప్లా కంపెనీలకు ఆఫర్​ ఇచ్చామని, ఒక్క జైడస్​ క్యాడిలా తప్ప మిగతా మూడు కంపెనీలు ఆఫర్​ తీసుకోలేదని ఐసీఎంఆర్​ చెప్పింది. దీంతో క్యాడిలాతో ఒప్పందం చేసుకున్నట్టు వెల్లడించింది. జిల్లా స్థాయిల్లో టెస్టులు చేయడానికి సిద్ధమవుతుండడంతో ఇప్పుడు సిప్లా, నెక్ట్స్​జెన్​ లైఫ్​ సైన్సెస్​ కూడా కొవిడ్​ కవచ్​ ఎలీసాను తయారు చేసేందుకు ముందుకొచ్చాయని తెలిపింది. ప్రస్తుతం కంపెనీల ఆఫర్​ను పరిశీలిస్తున్నామని చెప్పింది. ఐసీఎంఆర్​ గైడ్​లైన్స్​కు తగ్గట్టు నాన్​ ఎక్స్​క్లూజివ్​ లైసెన్స్​ కింద ప్రొడక్షన్​కు అనుమతిస్తామని చెప్పింది.

COVID-19 nationwide tally crosses 20.4 lakh corona tests

Latest Updates