దేశంలో క‌రోనా పేషెంట్ల‌ రిక‌వ‌రీ రేటు 31.7 %

దేశంలో కరోనా రివ‌క‌రీ రేటు భారీగా పెరుగ‌తోంద‌ని చెప్పారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్. ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్ బారినప‌డిన పేషెంట్ల‌లో 31.7 శాతం కోలుకున్న‌ట్టు తెలిపారు. మంగ‌ళ‌వారం ఆయ‌న దేశంలో క‌రోనా ప‌రిస్థితిపై మాట్లాడారు. దేశంలో ఇవాళ ఉద‌యం వ‌ర‌కు మొత్తం క‌రోనా కేసులు 70,756కు చేర‌గా.. అందులో 22,455 మంది కోలుకున్నార‌ని చెప్పారాయ‌న‌. దేశ వ్యాప్తంగా 2293 మంది ఈ మ‌హ‌మ్మారికి బ‌ల‌య్యార‌ని తెలిపారు.

దీంతో పేషెంట్ల రిక‌వ‌రీ రేటు 31.7 శాతానికి చేర‌న‌ట్లు తెలిపారు కేంద్ర మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్. ప్ర‌పంచంలోనే మ‌ర‌ణాల రేటు మ‌న దేశంలో చాలా త‌క్కువ‌గా ఉంద‌ని చెప్పారు. ప్ర‌పంచ స‌గ‌టు మ‌ర‌ణాల రేటు 7-7.5 శాతం ఉండ‌గా.. భార‌త్ లో 3.2 శాతం మాత్ర‌మేన‌ని తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో మ‌ర‌ణాల దేశ స‌గ‌టు క‌న్నా ఇంకా తక్కువ‌గా ఉంద‌న్నారు. క‌రోనా మ‌హ‌మ్మారిపై భార‌త్ అన్ని ర‌కాలుగా స‌మ‌ర్థ‌వంత‌మైన పోరాటం చేస్తోంద‌ని ఆయ‌న అన్నారు. వైర‌స్ ను అంతం చేసేందుకు ప‌రిష్కారం కోసం భార‌త ప్ర‌భుత్వం, శాస్త్ర‌వేత్త‌లు, స్టార్ట‌ప్స్ మొద‌లు పెద్ద‌పెద్ద కంపెనీల వ‌ర‌కూ నిరంత‌రం కృషి చేస్తున్న‌ట్లు తెలిపారు. వ్యాక్సిన్, డ్ర‌గ్స్ పై ప‌రిశోధ‌న‌ల‌తో పాటు దేశంలోనే కరోనా టెస్టు కిట్లు, పీపీఈలు, రెస్పిరేట‌రీ ప‌రిక‌రాల త‌యారీ వేగంగా జ‌రుగుతోంద‌ని చెప్పారు కేంద్ర మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్.

Latest Updates