దేశంలో తొలిసారిగా 70 శాతం పెరిగిన క‌రోనా కేసుల రిక‌వ‌రీ రేటు

క‌రోనా రికవరీ రేటు 70 శాతానికి పెరిగిందని, దేశంలో తొలిసారిగా మరణాల రేటు 2 శాతానికి పడిపోయిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ మాట్లాడుతూ దేశంలో మరణాల రేటు 1.99 శాతంగా ఉంద‌ని ప్ర‌క‌టించారు.

క‌రోనా టెస్ట్ లు, ట్రీట్మెంట్ వ‌ల్లే రిక‌వ‌రీ రేటు పెరుగుతున్న‌ట్లు చెప్పిన ఆరోగ్య‌మంత్రిత్వ శాఖ.. ఆసుపత్రులలో మెరుగైన వైద్యం, ట్రీట్మెంట్ పై దృష్టిపెట్టాల‌ని తెలిపింది.

అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న బాధితుల్ని స‌కాలంలో ఆస్ప‌త్రికి త‌ర‌లించేలా అన్నీ ఏర్పాటు చేయాల‌ని సూచించారు. అలా చేయ‌డం వ‌ల్ల బాధితుడికి ట్రీట్మెంట్ త్వ‌ర‌గా ఇస్తే..ఆయా స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చ‌ని భూష‌ణ్ తెలిపారు.

బాధితుల‌కు స‌త్వ‌ర ట్రీట్మెంట్ ఇవ్వ‌డం వ‌ల్లే కేస్ ఫాటాలిటీ రేట్ (సిఎఫ్ఆర్) తక్కువగా ఉంద‌న్నారు. ఈ రోజు ఇది 2 శాతం కంటే తక్కువగా పడిపోయింద‌ని, ప్రస్తుతం 1.99 శాతంగా ఉంద‌ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

వారం రోజుల్లో 2.5 కోట్ల క‌రోనా టెస్ట్ లు చేసిన‌ట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. దీంతో 15,83,489 రిక‌వ‌రీ కాగా గ‌త 24గంట‌ల్లో 47,746 డిశ్చార్జ్ అయిన‌ట్లు చెప్పారు.

Latest Updates