70.77శాతానికి పెరిగిన దేశంలో క‌రోనా వైర‌స్ రిక‌వ‌రీ రేటు

దేశంలో క‌రోనా వైరస్ వ్యాధిగ్ర‌స్తుల రిక‌వ‌రీ రేటు 70.77 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక ఈ వ్యాధి నుంచి కోలుకుంటున్న రోగుల సంఖ్య దాదాపు 17 లక్షలకు చేరుకోగా..కేసుల మరణాల రేటు 1.96 శాతానికి తగ్గిందని కేంద్రం ప్ర‌క‌టించింది.

గ‌డిచిన 24 గంటల్లో అత్యధికంగా 56,383 మంది క‌రోనా వైర‌స్ నుంచి రిక‌వ‌రీ అయ్యార‌ని..దీంతో వైర‌స్ తో మొత్తం కోలుకున్న రోగుల సంఖ్య 16,95,982 కు చేరిన‌ట్లైంది. దేశంలో 6,53,622 యాక్టీవ్ కేసులు ఉన్నాయ‌ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ప్రకారం, ఆగస్టు 12 వరకు మొత్తం 2,68,45,688 టెస్ట్ లు చేయ‌గా బుధవారం 8,30,391 నమూనాలను పరీక్షించారు.

కేంద్రరాష్ట్రాలు మ‌రియు కేంద్ర పాలిత ప్రాంతాలలో లక్షలాది మంది ఫ్రంట్ లైన్ కార్మికుల సహకారంతో వ్యాక్సిన్ టెస్ట్ లు చేయ‌డంతో పాటు హోం హైసోలేష‌న్, క్లినికల్ మేనేజ్‌మెంట్‌తో సహా అనేక రకాలైన చ‌ర్య‌లు ద్వారా టెస్ట్ లు చేయ‌డం తోపాటు భారీ సంఖ్య లో రోగుల‌కు వైర‌స్ త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

ఒకే రోజు 66,999 కేసులు న‌మోదు కావ‌డంతో మ‌న‌దేశంలో క‌రోనా వైర‌స్ బాధితుల సంఖ్య గురువారానికి 23,96,637 కు పెరిగింది. అయితే మరణించిన వారి సంఖ్య 47,033 వ‌ద్ద న‌మోదైంది.24 గంటల్లో 942 మంది ఈ వ్యాధి బారిన పడ్డారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.

Latest Updates