కరోనా మూడో వేవ్ రావడం పక్కా: ఐఎంఏ

కరోనా మూడో వేవ్ రావడం పక్కా: ఐఎంఏ

న్యూఢిల్లీ: దేశంలో పరిస్థితులు చూస్తుంటే కరోనా మూడో వేవ్ రావడం పక్కా అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) స్పష్టం చేసింది. కేసులు తగ్గుముఖం పడుతున్నాయనే సాకు చూపి కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి తథ్యం అని ఐఎంఏ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఏ వైరస్‌ల చరిత్ర చూసినా, అంతర్జాతీయ పరిణామాలు గమనించినా...భారతదేశంలో కరోనా మూడో వేవ్‌ రావడం తథ్యమని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ స్పష్టం చేసింది. గత ఏడాదిన్నర నుంచి దేశంలో కరోనా కేసులు బయటపడడం మొదలైనప్పటి నుంచి దేశంలోని పరిస్థితులను వైద్య నిపుణులు విశ్లేషిస్తూ వస్తున్నారని.. ఐఏఎం పేర్కొంది. గత ఏడాదిర్నర అనుభవాలు చూశాక... సాధ్యమైనంత ఎక్కువ మంది వ్యాక్సిన్లు వేయడం చాలా ఉత్తమమైన మార్గంగా కనిపిస్తోందని.. దీనితోపాటు కోవిడ్‌ ప్రొటోకాల్‌ను పాటించడ ద్వారానే కరోనా మూడో వేవ్‌ ప్రభావాన్ని చాలా వరకు తగ్గించగలమని ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ జేఏ జయలాల్‌, సెక్రెటరీ జనరల్ డాక్టర్ జయేష్ ఎం.లాల పేర్కొన్నారు. అన్ లాక్ ప్రక్రియ ను ప్రారంభించి దేశమంతటా ఉత్సవాలు, రాజకీయ సమావేశాలు.. ముఖ్యంగా ఎక్కువ మంది ఒకేచోట గుమిగూడే కార్యక్రమాలు.. యాత్రలు, మతపరమైన ఉత్సవాలను వాయిదా వేస్తే.. కరోనా మూడో వేవ్ ను మరికొన్ని నెలలు ఆపడం కాని.. కంట్రోల్ చేయడం కాని సాధ్యమవుతుందని  ఐఎంఏ తెలియజేసింది. దేశమంతటా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం పూర్తిస్థాయికి చేరముందే కరోనా నిబంధనలను నిర్లక్ష్యం చేస్తే.. అవే కోవిడ్‌ మూడో వేవ్‌ వ్యాప్తికి ఇవి కేంద్రాలు అయ్యే ప్రమాదం ఉందని ఐఏఎం హెచ్చరించింది. ఐఏఎం ప్రతినిధులు విడుదల చేసిన పత్రికా ప్రకటన యధాతథంగా కింద చూడొచ్చు.