60మిలియ‌న్ల వ్యాక్సిన్ పై ఒప్పొందం..వ‌చ్చే ఏడాదిలోనే

క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ కోసం ఆయా దేశాలు ప‌లు సంస్థ‌లతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు పోటీప‌డుతున్నాయి. తాజాగా యూకే ప్ర‌భుత్వం 2021 ప్రారంభ నెల‌ల్లో క‌రోనా వ్యాక్సిన్ ను విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న కంపెనీల్ని సంప్ర‌దిస్తున్నాయి.

ప్ర‌పంచంలో అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ‌లతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు తెలుస్తోంది. యూకేకి చెందిన ఫార్మా కంపెనీ గ్లాక్సో స్మిత్‌క్లైన్ తో పాటు ఫ్రాన్స్ కు చెందిన స‌నోఫి సంస్థ‌లు భారీ ఎత్తున క‌రోనా వ్యాక్సిన్ పై ప్ర‌యోగాలు చేస్తున్నాయి.

ఇందులో భాగంగా యూకే ప్ర‌భుత్వం గ్లాక్సో స్మిత్‌క్లైన్ మరియు సనోఫీ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పొందం ప్ర‌కారం 2021 సంవ‌త్స‌రం ప్రారంభ నెల‌ల్లో త‌మ‌కు సుమారు 60మిలియ‌న్ల క‌రోనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేయాల‌ని కోరింది.

స‌నోఫీ సంస్థ డీఎన్ఏ టెక్నాల‌జీ ఆధారంగా క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టే సీజ‌నల్ వ్యాధి ఫ్లూకు డ్ర‌గ్స్ ను ఉత్ప‌త్తిని సిద్ధం చేసేందుకు ప్రయోగాలు చేస్తోంది. ఈ ప్రయోగం విజ‌య‌వంతం అయితే క‌రోనా నుంచి ప్ర‌జ‌ల్ని కాపాడుతున్న హెల్త్ కేర్ రంగానికి చెందిన వారికి అందించేందుకు ప్రాధాన్యం ఇస్తున్న‌ట్లు స‌నోఫీ సంస్థ తెలిపింది.

Latest Updates