ప్రతి దేశంలో 20 శాతం మందికి వ్యాక్సిన్‌ అందాలి: డబ్ల్యూహెచ్‌వో

న్యూఢిల్లీ: వచ్చే ఏడాదికి 2 బిలియన్‌ల కరోనా వ్యాక్సిన్‌లు తయారు చేయడమే తమ లక్ష్యమని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌వో) స్పష్టం చేసింది. వ్యాక్సిన్ తయారైన తర్వాత ప్రతి దేశంలోనూ 20 శాతం మందికి దాన్ని అందించడమే టార్గెట్‌ అని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. రెండు బిలియన్‌ల కరోనా వ్యాక్సిన్ డోసుల తయారీకి సుమారు 18 బిలియన్‌లు ఖర్చవుతుందని గావి సీఈవో, చీఫ్​ డాక్టర్ సేత్ బెర్క్‌లే తెలిపారు. గావి సంస్థతో కలసి వ్యాక్సిన్‌ను రూపొందించడానికి డబ్ల్యూహెచ్‌వో ప్రయత్నాలు చేస్తోంది.

కోవ్యాక్స్ ఫెసిలిటీ కోసం నిర్వహించిన సమావేశంలో డబ్ల్యూహెచ్‌వో ఎగ్జిక్యూటివ్‌ బోర్డులో సభ్యుడైన హెచ్‌ఆర్‌‌డీ మినిస్టర్ హర్షవర్ధన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రపంచ అవసరాలకు కావాల్సిన దాంట్లో 60 శాతం వ్యాక్సిన్‌ను ఇండియా సప్లయి చేస్తుందని హర్షవర్ధన్ చెప్పారు. వ్యాక్సిన్‌ను త్వరగా తీసుకొచ్చేందుకు ఫాస్ట్‌ట్రాక్ మెకానిజమ్‌ను ప్రవేశపెట్టాలని సూచించారు. ఇక వ్యాక్సిన్‌ తయారీల విషయానికి వస్తే.. నార్త్ అమెరికా, ఏషియా–పసిఫిక్‌, యూరప్‌ల్లో మూడేసి వ్యాక్సిన్‌లు అభివృద్ధి దశలో ఉన్నాయి. ప్రతి దేశ జనాభాలో కనీసం 20 శాతం మంది జనాభాకు వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలని డా.స్వామినాథన్ చెప్పారు. ముందుగాప్రతి దేశ జనాభాలో 3 శాతంగా ఉన్న హెల్త్ వర్కర్స్‌కు తొలుత వ్యాక్సిన్ అందజేయనున్నారు. అలాగే రెండో ప్రయారిటీగా దేశ జనాభాలో 20 శాతం జనాభాకు అందించనున్నారు.

Latest Updates