చైనా ప్ర‌భుత్వమే క‌రోనాను త‌యారు చేసింది.. జిన్ పింగ్ అవున‌న్నా కాద‌న్న ఇదే నిజం

చైనా అధ్య‌క్షుడు జిన్ పింగ్ అవున‌న్నా కాద‌న్న ఇదే నిజం. క‌రోనా వైర‌స్ వెట్ మార్కెట్ నుంచి వ్యాపించ‌లేద‌ని, వుహాన్ ల్యాబ్ లో క‌రోనాను సృష్టించార‌నే ఆధారాలు కొన్ని వెలుగులోకి వ‌చ్చాయి.

న్యూస్ 18క‌థ‌నం ప్ర‌కారం.. క‌రోనా వైర‌స్ వుహాన్ లోని వెట్ మార్కెట్ నుంచి వ్యాపించింద‌ని, వుహాన్ ల్యాబ్ లో త‌యారు కాలేద‌ని చైనా వాదిస్తుంది. ఆ వాద‌న‌పై ప్ర‌పంచ దేశాల‌కు చెందిన నిపుణులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వారిలో చైనా వైరాజిస్ట్ లు ఉన్నారు. ఆరోపించిన వైరాల‌జిస్ట్ ల్ని చైనా ప్ర‌భుత్వం హ‌త‌మార్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

తాజాగా హాంకాంగ్ కు చెందిన వైరాల‌జిస్ట్ డాక్ట‌ర్ లి మెంగ్ యాన్ మాట్లాడుతూ క‌రోనా వైర‌స్ పై తాను ప‌రిశోధ‌న‌లు చేసిన‌ట్లు తెలిపింది. డిసెంబ‌ర్ నెల‌లో హాంగ్ కాంగ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో ప‌నిచేస్తున్న‌ప్పుడు చైనా లో పుట్టిన వైర‌స్ గురించి ద‌ర్యాప్తు చేయాల‌ని త‌న పై అధికారిని కోరాన‌ని, ఆయ‌న చైనా ప్ర‌భుత్వంతో చేతులు క‌లిపి త‌న‌ని బెదిరించిన‌ట్లు చెప్పింది.

ప‌రిశోధ‌న‌ల గురించి బ‌య‌ట‌కు చెబితే త‌న‌ని హ‌త‌మారుస్తామాన్నారు. కానీ ఈ విష‌యం గురించి నేను సైలెంట్ గా ఉండ‌లేక‌పోయాను . అందుకే క‌రోనా గురించి బ‌హిర్ఘ‌తం చేస్తున్న‌ట్లు చెప్పారు.

ఆ త‌రువాత చైనా నుంచి బెదిరింపులు ఎక్కువ కావ‌డంతో భ‌ద్ర‌త కోసం హాంకాంగ్ నుంచి అమెరికా వ‌చ్చిన‌ట్లు వైరాల‌జిస్ట్ చెప్పారు. తాను చేసిన ప‌రిశోధ‌న‌ల ఆధారంగా క‌రోనా వుహాన్ వైరాల‌జీ ల్యాబ్ నుంచి ఎలా త‌యారు చేయ‌బ‌డిందన్న అనుమానాల్ని నివృత్తి చేసే ప్ర‌య‌త్నం చేశారు లి మెంగ్ యాన్.

జీవ‌శాస్త్రం పై పరిజ్ఞానం ఉన్న‌వాళ్ల‌కి వైర‌స్ గురించి తెలుస్తోంది. వైర‌స్ ను త‌యారు చేయ‌వచ్చు.అది ఎలా పుడుతుంది అనే అంశంపై వాళ్ల‌కే అవ‌గాహ‌న ఉంటుందని వైరాల‌జిస్ట్ డాక్ట‌ర్ లి మెంగ్ యాన్ చెప్పిన‌ట్లు న్యూస్ 18 త‌న క‌థ‌నంలో పేర్కొంది.

Latest Updates