ఒక్క రోజే రూ.వెయ్యి పెరిగిన బంగారం

కోవిడ్ ఎఫెక్ట్‌‌తో ప్రపంచ మార్కెట్లన్నీ అతలాకుతలమవుతుండడంతో.. గోల్డ్ మెరిసిపోతోంది. సేఫ్ ఇన్వెస్ట్‌‌మెంట్ సాధనంగా ఇన్వెస్టర్లు గోల్డ్‌‌ను ఎంచుకుంటుండటంతో, దాని ధర భారీగా పెరుగుతోంది. సోమవారం ఒక్కరోజే గోల్డ్ ధర వెయ్యి రూపాయల మేర పెరిగింది.దేశ రాజధానిలో 10 గ్రాముల బంగారం ధర రూ.953 పెరిగి రూ.44,472కు ఎగిసింది. రూపాయి బలహీనపడటం, గ్లోబల్‌‌గా మార్కెట్లు పడిపోతూ ఉండటం, అంతర్జాతీయంగా గోల్డ్‌‌కు డిమాండ్ బాగా పెరగడంతో దీని ధరలు పెరుగుతున్నాయని హెచ్‌ డీఎఫ్‌ సీ సెక్యు రిటీస్ తెలిపింది. సిల్వర్ ధరలు కూడా కే జీ కి రూ.586 పెరిగి రూ .49,990గా రికార్డయ్యాయి. ఇంటర్నేషనల్ స్పాట్ గోల్డ్ ధరలు పెరుగుతుండటంతో, దేశంలో కూడా ధరలు కంటిన్యూ గా పెరుగుతున్నాయని బులియన్ వర్గాలు పేర్కొన్నాయి.ఇంటర్నేషనల్‌ గా ఔన్స్‌ బంగారం ధర 1,680 డాలర్ల వద్ద ర్యాలీ చేస్తోంది.

Latest Updates