ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కు క్యూ..62,703 చేరిన కరోనా బాధితుల సంఖ్య

ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్‌కు కరోనా పేషెంట్లు పోటెత్తుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వేలల్లోబెడ్లు ఖాళీగా ఉన్నాయని సర్కార్‌ చెబుతున్నా.. ప్రైవేటు కు వెళ్ల‌డానికే మొగ్గు చూపుతున్నారు. గురువారం ఒక్కరోజే 585 మందికిపైగా పేషెంట్లు ప్రైవేట్ హాస్పిటల్స్‌‌లో అడ్మిట్ అయ్యారు. రాష్ట్రంలో ని 95 ప్రైవేట్ హాస్పిటల్స్‌‌లో 3,297 మంది కరోనా పేషెంట్లు ట్రీట్మెంట్ పొందుతున్నారని గురువారంనాటి బులెటిన్‌‌లో ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ సంఖ్య3,882కు పెరిగినట్టు శుక్రవారం బులెటిన్‌‌లో పేర్కొంది.

ఈ లెక్కన ఒక్క రోజులోనే వందల మంది ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించినట్టు స్పష్టమవుతోంది. ఇక ప్రభుత్వ హాస్పిటల్స్లో మరో 2,282 మంది ట్రీట్‌‌మెంట్ తీసుకుంటున్నట్టు బులెటిన్‌లో వెల్లడించారు. మొత్తంగా 6,164 మంది హాస్పిట‌ల్స్ లో ఇన్‌పేషెంట్లుగా ఉండగా, ఇందులో 1,035 మంది ఐసీయూ (వెంటిలేటర్‌/ సీపాప్‌)లో ఉన్నారు. మరో 2,712 మంది ఆక్సిజన్‌పై ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టీవ్ పేషెంట్లు16,796 మంది ఉండగా, ఇందులో 10,632(63.3%) మంది హోం, ఇనిస్టిట్యూషన్‌లో ఐసోలేషన్‌ ఉన్నారు . 6,164 (36.7%) మంది హాస్పిటల్స్‌‌లో ఉన్నారు.బాధితుల్లోపది శాతం మందికే హాస్పిటల్‌‌అవసరం అని చెబుతున్నా, రాష్ట్రంలో వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉన్నట్టు ఈ లెక్కలు చెబుతున్నాయి.

మరో 1,986 కేసులు

ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య62,703కు పెరిగింది. ఇందులో బుధవారం రాత్రి 8 గంటల నుంచి గురువారం రాత్రి 8 గంటల వరకు 1,986 మందికి వైరస్ పాజిటివ్ వచ్చింది.వీటిలో గ్రేటర్‌హైదరాబాద్‌పరిధిలో 586, జిల్లాల్లో 1,400 కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ పేర్కొంది.జిల్లాల్లో అత్యధికంగా రంగారెడ్డి(నాన్ జీహెచ్‌ఎం సీ) 205, మేడ్చల్‌‌(నాన్‌ జీహెచ్‌ఎంసీ) 207,వరంగల్‌‌అర్బన్‌లో 123, కరీంనగర్‌ 116, సంగా రెడ్డి108, మహబూబ్‌నగర్‌లో 61 కేసులు నమో దయ్యాయి. మిగిలిన జిల్లాల్లో 50 కంటే తక్కువ కేసులు వచ్చాయి. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 62,703కు పెరిగింది. ఇందులో 45,388 మంది వైరస్ నుంచి కోలుకోగా, 16,796 మంది యాక్టీవ్ పేషెంట్లు ఉన్నారు.

ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం.. మరో 14 మంది మృతి

కరోనా మరణాల సంఖ్య 519కి పెరిగింది. బుధవారం రాత్రి నుంచి గురువారం రాత్రి 8 గంటల వరకు 14 మంది చనిపోయారని, మొత్తం మరణాల సంఖ్య 519కు పెరిగిందని బులెటిన్‌లో పేర్కొన్నారు. ఈ 519 మందిలో 280 మందికి కరోనాతోపాటు ఇతర జబ్బులు కూడా ఉన్నాయి. ఏ జబ్బూ లేకుండా కేవలం కరోనా కారణంగానే 239 (46.13%) మంది కన్నుమూశారు. కోమార్బిడ్‌ కండీషన్‌ లేకుండా ఈస్థాయి లో మరణాలు మరే రాష్ట్రంలోనూ జరగడం లేదు. ఇక రాష్ట్రంలో మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 4,37,582కుపెరిగింది. గురువారం అత్యధికంగా 21,380 టెస్టులు చేసినట్టు బులెటిన్‌లో చెప్పింది.

Latest Updates