పోలీసుల‌కు మెల్టన్ వాటర్ బాటిల్స్ అందించిన‌ సీపీ

హైద‌రాబాద్: పోలీసులు కూడా క‌రోనా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు హైద‌రాబాద్ సీపీ. లాక్ డౌన్ లో క‌ష్ట‌ప‌డుతున్న‌ పలువురు పోలీస్ సిబ్బందికి మెల్టన్ వాటర్ బాటిల్స్ అందించారు సీపీ. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ఆయ‌న‌..ప్రతి పోలీస్ స్టేషన్లో సోషల్ డిస్టన్స్ పాటిస్తూ పేద ప్రజలకు నిత్యావసర సేవలు అందిస్తున్నామ‌న్నారు.

కరోనా నివారణకు మే 7 వరకు ప్రతి ఒక్కరు లాక్ డౌన్ అమలు చేస్తూ సోషల్ డిస్టన్స్ పాటించాలన్నారు సీపీ అంజ‌న్ కుమార్. అలాగే స్థానిక‌ దాతల సహాయంతో పాటు పోలీస్ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో పేద ప్రజలకు నిత్యవసర వస్తువులు అందిస్తున్నామ‌ని తెలిపారు. ఈ క్ర‌మంలోనే కులుసుమ్ పురా, జియగూడా, కార్వాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న 420 మంది పేదలకు బియ్యం, నిత్యావసర వస్తువులు అందించామ‌న్నారు సీపీ.

Latest Updates