సమ్మెలు చేస్తే చూస్తూ ఊరుకోం: సీపీ అంజనీ కుమార్

సమ్మెలతో రాస్తారోకోలతో ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకోమని అన్నారు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్. హైదరాబాద్ కు దేశ విదేశాలనుంచి చాలా మంది వ్యాపారాలు చేసుకునేందుకు వస్తారని అన్నారు.  కొంతమంది రాస్తా రోకోలు చేసి నగరాన్ని తమ గుప్పిట్లోకి తీసుకోవాలని చూస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి చర్యలను తాము సహించమని అన్నారు. మంత్రులనివాసం ముట్టడి సరికాదని.. రోడ్డు నెంబర్ 12 నుంచి చాలా మంది ప్రజలు వెళ్తుంటారని వారిని ఇబ్బంది పెట్టేలా చూడవద్దని అన్నారు. హైదరాబాద్ సిటీ ఇమేజ్ ను దెబ్బతీయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పారు.

Latest Updates