డిపార్ట్‌మెంట్ పరువు తీసేలా వార్తలు రాయొద్దు

డిపార్ట్ మెంట్ పరువు తీసేలా నిరాధార వార్తలు రాయొద్దని, ఆధారాలు లేకుండా వార్తలు రాస్తే ప్రొఫెషనల్ రిపోర్టింగ్ అనిపించుకోదని అన్నారు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్.  శనివారం ఓ పేపర్ లో పబ్లిష్ అయిన వార్తల్లో నిజం లేదని, దొంగలతో దోస్థాని అంటూ వచ్చిన ఆ కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు.

మీడియా రాసే వార్తలపై ప్రజల్లో నమ్మకం రావాలని, లంచాలు తీసుకుని ప్రమోషన్స్ ఇస్తున్నారు అనడానికి మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయో చూపాలని సదరు మీడియా సంస్థనుద్దేశించి అన్నారు అంజనీ కుమార్. రాష్ట్రం ఏర్పడ్డ తరువాత నక్సలిజం పెరుగుతుందని అప్పట్లో ప్రచారం జరిగింది కానీ అరేండ్ల కాలంలో నక్సలిజం,టెర్రరిజం కదలికలు లేవని అన్నారు . గత ఆరు నెలలు లో సిటీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదన్నారు.

ప్రతీ విషయాన్ని మీడియాతో షేర్ చేస్తున్నామని, ప్రభుత్వం, ప్రజల సహకారంతో దేశంలోనే బెస్ట్ పోలిసింగ్ గా నిలిచామని చెప్పారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లు, రికమండేషన్స్ లేకుండా వర్క్ చేస్తున్నామని, తమకు చాలా ఫ్రీడమ్ ఉందని తెలిపారు. ట్రాన్స్ ఫర్స్, ప్రమోషన్స్ నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని, ప్రెస్ బాధ్యత గా వ్యవహారించి వార్తలు రాయాలని  సూచించారు.

Latest Updates