నగరంలో 92 మంది పోలీసుల సస్పెన్షన్ నిజం కాదు

నగరంలో విధులు నిర్వహిస్తున్న 92 మంది పోలీసులను సస్పెండ్ చేసినట్లు వస్తున్న వార్తలను హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ఖండించారు. ఇది తప్పుడు వార్త అని, దీనిని సర్క్యూలేట్ చేసిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో కొంతమంది వారివారి స్వార్థ ప్రయోజనాల కోసం ఈ వార్తను పోస్టు చేశారని ఆయన అన్నారు. పోలీసు ఐటీ విభాగం ద్వారా వారేవరో తెలుసుకొని చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

రెండు రోజుల క్రితం నగరంలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలలో కొంతమంది పోలీసులు కొన్ని పార్టీల అభ్యర్థులకు సహకరించారని 72 మంది కానిస్టేబుళ్లను, 20 హెడ్ కానిస్టేబుళ్లను సీపీ అంజనీ కుమార్ సస్పెండ్ చేశారని ఒక వార్త వచ్చింది. ఇది తప్పుడు వార్త అని ఆయన ట్వీట్ చేశారు.

For More News..

క్లాస్‌రూంలో పెళ్లి చేసుకున్న ఇంటర్ విద్యార్థులు

భోపాల్ గ్యాస్ ఘటన నుంచి తప్పించుకున్న 102 మంది కరోనాతో మృతి

మొదలైన రీపోలింగ్.. సిరా చూపుడు వేలుకు పెట్టట్లేరు

Latest Updates