కానిస్టేబుల్ తులసీరాం పాడె మోసిన కమిషనర్ సజ్జనార్

cp-sajjanar-carried-hearse-of-constable-tulasiram

మధ్యప్రదేశ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ తులసీరామ్ అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఆయన కానిస్టేబుల్ గా పనిచేస్తుండేవారు. కాటేదాన్ లో జరిగిన రేప్ కేసు నిందితుడిని బిహార్ లో పట్టుకుని తీసుకొస్తుండగా.. తెలంగాణ పోలీసులు ప్రయాణిస్తున్న వాహనానికి మధ్యప్రదేశ్ లో యాక్సిడెంట్ అయింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ తులసీరామ్ ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ లో జరిగిన కానిస్టేబుల్ అంత్యక్రియలకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

విధి నిర్వహణలో అమరుడైన తులసీరామ్ కు .. పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కానిస్టేబుల్ తులసీరామ్ పాడెను సీపీ సజ్జనార్ తన భుజాలపై మోశారు.  ఆయనతోపాటు.. మిగతా ఉన్నతాధికారులు కూడా అంతిమయాత్రలో పాల్గొని పాడె మోశారు.

కానిస్టేబుల్ తులసీరాం స్టేషన్ లో మంచి కానిస్టేబుల్ అని సీపీ వీసీ సజ్జనార్ అన్నారు. డ్యూటీలో చాలా యాక్టివ్ గా ఉండేవాడని చెప్పారు. కమిషనరేట్, ఆఫీసర్స్, ప్రభుత్వం తరఫునుంచి సంతాపం వ్యక్తంచేస్తున్నానని అన్నారు. కానిస్టేబుల్ కుటుంబానికి నిబంధనల ప్రకారం రావాల్సిన రూ.14 లక్షలు అందిస్తామన్నారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వస్తుందన్నారు. మనిషిని తీసుకురాలేం కానీ.. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం, పోలీస్ డిపార్టుమెంట్ ఆదుకుంటుందని చెప్పారు సజ్జనార్.

మధ్యప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం : తెలంగాణ కానిస్టేబుల్ మృతి

Latest Updates