ఆగస్టు 15న ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నిరసన తెలియజేస్తా: సీపీఐ నేత నారాయణ

వరంగల్ అర్బన్: ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ రోజున మన దేశ రాజ్యాంగాన్ని.. రక్షించండి….ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ..  నిరసనలు వ్యక్తం చేస్తానని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ప్రకటించారు. వరంగల్ ఎంజీఎంను సందర్శించిన సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్రచారం ఆర్భాటమేనని విమర్శించారు. పెట్టుబడిదారీ వ్యవస్థ కు కొమ్ము కాస్తున్న కేంద్ర ప్రభుత్వం, హిందు దేశంగా మార్చేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు. దేశం అభివృద్ధి లో అగ్ర స్థానంలో లేకున్నా… కోవిడ్ లో  మాత్రం ప్రపంచంలో మూడో స్థానానికి చేరిందన్నారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి మాట్లాడుతూ.. ఎంజీఎం లో జరుగుతున్న పరిణామాల పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎంజీఎం లో కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని.. వెంటనే కనీస సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

Latest Updates