రాష్ట్రంలో పరిణామాలపై HRC కి ఫిర్యాదు చేసిన నారాయణ

  • చట్టాన్ని కూడా పట్టించుకోకుండా పాలన
  • సకల జనుల సమ్మె ఆర్టీసీ పాత్ర కీలకం
  • కార్మికులు లేనిదే కేసీఆర్ సీఎం అయ్యాడా.?: నారాయణ

ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ జాతీయ మానవ హక్కుల  సంఘానికి ఫిర్యాదు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని నారాయణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

సమ్మె నోటీస్ ఇచ్చి చట్టం ప్రకారం సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులపై కేసీఆర్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. కోర్టు తీర్పులను కూడా పట్టించుకోకుండా, చట్టాలను తుంగలో తొక్కి నిరంకుశంగా పాలిస్తున్నారని  నారాయణ అన్నారు.

ఆర్టీసీ కార్మికుల డిమాండ్ లు సరైనవని, వారి డిమాండ్స్ కోసమే వాళ్లు సమ్మె చేస్తున్నారన్నారు. ఆర్టీసీకి ఎండిని నియమించి ఉంటే కార్మికుల సమస్యలు తీరేవని చెప్పారు.  కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడంటే దానికి కారణం సకల జనుల సమ్మె అని…అందులో ఆర్టీసీ కార్మికుల పాత్ర చాలా పెద్దదని అన్నారు. కేసీఆర్ ఆర్టీసీని ప్రవేయిట్ చెయ్యాలని…వాటి ఆస్తులను కొల్లగొట్టాలని చూస్తున్నారని నారాయణ అన్నారు.

CPI leader Narayana complained to the NHRC on telangana state present issue

Latest Updates