రాజ్ భవన్ ముట్టడికి CPI ప్రయత్నం

ఇంటర్ బోర్డ్ వివాదంలో ప్రభుత్వం తీరుకు నిరసనగా… రాజ్ భవన్ ముట్టడికి ప్రయత్నించింది సీపీఐ. సీపీఐ కార్యకర్తలను ఖైరతాబాద్ సర్కిల్ వద్ద అరెస్ట్ చేసి.. నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసుల. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉంటూ.. ఈ వ్యవహారంపై గవర్నర్ ప్రేక్షక పాత్ర పోషించడం దారుణం అన్నారు సీపీఐ హైదరాబాద్ సెక్రటరీ నర్సింహ. ఇంటర్ వివాదంపై గవర్నర్ స్పందించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల చావుకు కారణం అయిన గ్లోబరీనా యజమానిని అరెస్ట్ చేయాలన్నారు కామ్రేడ్లు. విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలన్నారు.

Latest Updates