కార్పొరేట్లకు రాయితీలతోనే ఆర్ధిక మాంద్యం : తమ్మినేని, చాడ

హైదరాబాద్, వెలుగు: ప్రజా వ్యతిరేక విధానాలను, కార్పొరేట్ శక్తులను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించడం వల్లే దేశంలో ఆర్థిక మాంద్యం ఏర్పడిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. హైదరాబాద్​లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘మోడీ ప్రజావ్యతిరేక విధానాలు – ఆర్థిక మాంద్యం’ అంశంపై లెఫ్టిస్ట్ పార్టీల రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి సమావేశంలో మాట్లాడారు. కేంద్రంలో మోడీ సర్కార్ కార్పోరేట్ సంస్థలకు రాయితీలు ఇవ్వడంతోనే నేడు ఆర్థిక మాంద్యం ఏర్పడిందని తమ్మినేని మండిపడ్డారు. ఈ ప్రభావం దేశంలోని అన్ని రాష్ట్రాల మీద పడిందన్నారు. ఈ నెల16 వరకు రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. చాడ వెంకట్‌‌రెడ్డి మాట్లాడుతూ ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందన్నారు. మోడీ సర్కారు తప్పుడు విధానాలతో దేశం ఆర్థికంగా దివాళా తీసిందని విమర్శించారు. కార్పొరేట్‌‌రంగానికి రాయితీలిస్తే దేశంలోని ఆర్థిక మ్యాంద్యం తగ్గదని ప్రముఖ ఆర్థికవేత్త పాపారావు అభిప్రాయపడ్డారు. వ్యవసాయరంగంలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టాలని తద్వారా కొంత ఉపశమనం కలిగే అవకాశముంటుందన్నారు.సదస్సులోఎంసీపీఐ (యూ) రాష్ట్ర నాయకులు ఉపేందర్‌‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Latest Updates