మెట్రోపై నీలినీడలు : ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్ గోడల మీద భారీ పగుళ్లు

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మెట్రోరైలు నిర్మాణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎల్ అండ్ టీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి.  హైదరాబాద్ మెట్రో రైలు నిర్మాణం దేశానికే ఆదర్శం. దశాబ్ధాల పాటు రైలు నిర్మాణాలు చెక్కు చెదరకుండా ఉంటాయని నేతలు, మెట్రో అధికారులు గొప్పలు చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే గత నెలలో వర్షం పడుతుందని అమీర్ పేట మెట్రో స్టేషన్ కింద నిల్చున్న వివాహిత మౌనిక (26) పై సిమెంట్ పెచ్చులూడి మృతి చెందింది. దీంతో ఇన్నాళ్లు మెట్రో రవాణా భద్రతగా పేరుగా భావించిన నగర ప్రజల్లో అనుమనాలు, ఆందోళనలు తలెత్తుతున్నాయి.

తాజాగా అమీర్ పేట్ మెట్రో స్టేషన్ మౌనిక ఘటన మరిచి పోకముందే ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్ గోడల మీద భారీ పగుళ్లు రావడంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెట్రో అందుబాటులోకి వచ్చి కనీసం రెండేళ్లు కూడా కాకుండానే మరీ ఇలా పగుళ్లురావడంపై మెట్రోరైల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Latest Updates