అబ్రాడ్ ఆన్‌లైన్ కోర్సులకు క్రేజ్.. లాక్‌డౌన్ టైంలో డబులైన లెర్నర్స్

  • ఆఫ్ లైన్ కోర్స్ లెక్క రెగ్యులర్ క్లాసులు
  • సర్టిఫికేషన్, ప్లేస్ మెంట్ ఆఫర్స్ అందిస్తున్న కంపెనీలు
  • మాస్టర్స్ లో ఎంబీఏపై ఇంట్రెస్ట్ చూపిస్తున్న లెర్నర్స్

హైదరాబాద్, వెలుగు: ఆస్ట్రేలియా, యూకే, యూఎస్, కెనడా వంటి దేశాల్లో హయ్యర్ స్టడీస్ చేసేందుకు సిటీ నుంచి ఏటా కొన్ని వేల మంది వెళ్తుంటారు. అబ్రాడ్ యూనివర్సిటీలలో రెగ్యులర్ కోర్స్ లు చేసేవారితో పాటు ఆన్ లైన్ కోర్స్ లు చేసేవారు కూడా వేలల్లోనే ఉంటారు. లాక్ డౌన్ కారణంగా ఆన్లైన్ లో కొత్త కోర్సుల్లో చేరేవారి సంఖ్య 50శాతం పెరిగింది. ఎంబీఏ, ఎంఎస్సీ వంటి కోర్సులు చేయాలనుకునేవారు ఆన్లైన్ కోర్సుల్లో జాయిన్ అయిపోతున్నారు. దీంతో ఒకప్పటితో పోలిస్తే రెండింతలు లెర్నర్స్ పెరిగారని అబ్రాడ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీల వారు చెబుతున్నారు. రెగ్యులర్ మాస్టర్స్ తో చేసేవారితో పాటు వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని, ముఖ్యంగా ఆస్ట్రేలియా, యూకే లో ఎంబీఏ చేసేందుకు మొగ్గుచూపుతున్నారని అన్నారు. దీంతో ఇతర కోర్స్ లతో పోలిస్తే ఎంబీఏకు ఉన్న క్రేజ్తో ఆయా యూనివర్సిటీలు ఫీజులు కూడా పెంచేశాయి. అబ్రాడ్ ఆన్లైన్ కోర్స్ లకు జనవరి 31న కొత్త బ్యాచ్ మొదలవనుంది. మాస్టర్స్ తో పాటు ఇప్పుడు బ్యాచిలర్ కోర్స్ లను కూడా కంపెనీలు అందుబాటులోకి తెస్తున్నాయి.

ఆన్లైన్ కోర్సులకే..

ఆన్లైన్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ కు సంబంధించి అప్ గ్రేడ్, సింప్లి లెర్న్, కోర్స్ ఎరా, ఎడ్యురేఖ వంటి పలు కంపెనీలు వివిధ ప్యాకేజీలను అందిస్తున్నాయి. ఈ కంపెనీల ద్వారా కోర్స్ లు నేర్చుకుంటున్న లెర్నర్స్ లక్షల్లోనే ఉంటారు. అబ్రాడ్ మాస్టర్స్ కోర్స్ లలో ఎంబీఏ, డాటా సైన్స్, మెషీన్ లెర్నింగ్, మార్కెటింగ్, మేనేజ్మెంట్, సాఫ్ట్ వేర్, సేల్స్ అండ్ ఇన్సూరెన్స్ వంటివి 20కి పైగా కోర్సులు ఉన్నాయి. గతేడాది ఎంబీఏ కోర్స్ కి 4.50లక్షల ఫీజు ఉంటే ఇప్పుడు డిమాండ్ ని బట్టి 5.70లక్షలకు పెరిగింది.

ఇండస్ట్రియల్ కరిక్యులమ్..

ప్రతి కోర్స్ లో ఆయా రంగానికి సంబంధించి ఇండస్ట్రియల్ ఎక్స్ పర్ట్స్ ఇన్వాల్మెంట్ ఉంటుంది. వీరు ఇండస్ట్రియల్ రెలవెంట్ టాపిక్స్ మీద క్లాసులు తీసుకుంటారు. దీంతో పాటు కోర్సు ఆన్లైన్ క్లాసులు జరిగేటప్పుడు క్వశ్చన్, ఆన్సర్స్ అడిగే అవకాశం ఉంటుంది.

ప్లేస్మెంట్ సపోర్ట్..

ఈ కోర్స్ లు చేసేవారికి చదువయ్యాక ప్లేస్ మెంట్ సపోర్ట్ కూడా అందిస్తారు. రెజ్యుమ్ ఏ విధంగా ఉండాలి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చెప్తారు. ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేముందు మాక్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

డబుల్ అయ్యారు…

అప్ గ్రేడ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ 2015లో స్టార్ట్ అయింది. ప్రతినెలా టర్నోవర్ కోట్లలో ఉంటుంది. ఏటా మార్చ్ లో 4 వేలమంది లెర్నర్స్ జాయిన్ అయితే 2020 మార్చ్ లాక్ డౌన్ లో 8 వేల మంది వరకు జాయిన్ అయ్యారు. డిసెంబర్ లో దేశవ్యాప్తంగా దాదాపు రూ.75 కోట్ల టర్నోవర్ వచ్చింది. ఆస్ట్రేలియా, యూకే లలోని వర్సిటీలతో టైఅప్ అయి ఉంటాయి.   – మహేశ్ (అప్ గ్రేడ్ ఆన్లైన్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ కంపెనీ)

Latest Updates