ఆన్‌లైన్‍ క్లాసులకు క్రేజ్.. ఇవీ ఉపయోగాలు

యూకేజీ నుంచి ప్రొఫెషనల్‍ కోర్సుల దాకా వెబ్ లోనే టీచింగ్

తక్కువ ఖర్చు.. ఎక్స్ పర్ట్స్ తో పాఠాలు చెప్పించుకునే వీలు

ఆసక్తి చూపుతున్న స్టూడెంట్స్, పేరెంట్స్

హైదరాబాద్‍, వెలుగు: ఆన్ న్ లో పాఠాలు వినేందుకు స్టూడెం ట్స్ ఆసక్తి చూపుతున్నారు. నగరంలో ఇట్లాంటి ట్యుటోరియల్స్ కు డిమాండ్‍ పెరుగుతోంది. ఇంటి దగ్గరే ఉండి చదువుకునే వెసులుబాటు ఉండడంతో పేరెంట్స్ కూడా ఇంట్రస్ట్ పెడుతున్నారు. టైం కలిసిరావడంతో పాటు తక్కువ ఖర్చుతో పాఠాలు నేర్చుకు నే వీలుంటోంది. గ్రాఫిక్స్ సాయంతో పాఠాలు అర్థమయ్యేలా చెప్పడంతో విద్యార్థులకు కూడా ఈజీ అవుతోంది. జాతీయ, అంతర్జాతీయంగా ఆయా రంగాల్లో నైపుణ్యం ఉన్నవారితో తక్కు వ ఖర్చుతో పాఠాలు చెప్పించుకునే వెసులుబాటు ఆన్ లైన్‍ ట్యూటోరియల్స్ ద్వారా లభిస్తోంది. అకాడమిక్‍ సబ్జెక్టు లు, పోటీ పరీక్షలు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇలా అన్ని విభాగాల్లో పాఠాలు చెప్పేందుకు ట్యూటోరియల్‍ రెడీగా ఉన్నాయి.

క్లాస్‍, సబ్జెక్టు, టాపిక్‍ ఆధారంగా

అర్బన్ ప్రొ, యూడెమీ, హోమ్‍ ట్యూటర్‍ సైట్‍, జస్ట్ ట్యూటర్‍, వేదాం తు, లెర్న్ పిక్‍, వికాస్‍ అకాడమీ వంటి వెబ్ సైట్లు ఆన్ న్‍ ట్యూటోరియల్స్ ను అందిస్తున్నాయి. ఇందులో యూకేజీ నుం చి పీజీ, ప్రొఫెషనల్ కోర్సు ల దాకా ట్యూటర్లు ఉన్నారు. క్లాస్‍, సబ్జెక్టు , టాఫిక్‍ ఎట్ల కావాలంటే అలా పాఠాలు చెప్పే వెసలుబాటు ఉంది. ఒకసారి ఫీజు చెల్లించిన  విద్యార్థులు అపరిమితంగా వీడియోలను చూసే అవకాశం కల్పిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో బోధించే అనుభవజ్ఞు లైన టీచర్లు ఇందులో పాఠాలు చెప్పేందుకు ఇంట్రస్ట్ చూపుతున్నారు. టీచింగ్‍ అనుభవం, రేటింగ్‍, గత పాఠాల బోధన డెమో వీడియోలను చూసి ట్యూటర్ ను ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఉంది. అవసరమైతే వారితో ఫోన్ లో మాట్లాడి సందేహాలను నివృత్తి చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నాయి కొన్ని వెబ్ సంస్థలు. ఐఐటీలో చదువుతున్న వారితో మ్యాథ్స్, సైన్స్ పాఠాలు చెప్పించుకోవచ్చు. చదువులతోపాటు కెరీర్ కు ఉపయోగపడే అనేక అంశాలను ప్రముఖ తెలుసుకోవచ్చు. ఆయా అంశాలకు సంబంధించిన డయాగ్రామ్స్ ను 3డి రూపంలో చూస్తూ నేర్చుకోవచ్చు.

 

Latest Updates