కామెడీకి బాక్సాఫీస్ బ్రహ్మరథం

కామెడీకి బాక్సాఫీస్ బ్రహ్మరథం
  •  ఎఫ్ 3 మూవీ కలెక్షన్ల జోరు 
  • తొలి రోజు రూ.10.35 కోట్లు వసూలు
  • కామెడీ స్టోరీలతో ముందుకు రానున్న నాని, గోపీచంద్  

నేచురల్ స్టార్ నాని రాబోయే సినిమా.. ‘అంటే.. సుందరానికీ’

మాచో స్టార్ గోపీచంద్ తదుపరి మూవీ.. ‘పక్కా కమర్షియల్’ 

యువ హీరో నాగశౌర్య అప్ కమింగ్ ఫిల్మ్.. ‘కృష్ణ వ్రింద విహారి’

యువ హీరో కిరణ్ అబ్బవరం రాబోయే సినిమా.. ‘సమ్మతమే’

ఇవన్నీ కామెడీతో బాక్సాఫీస్ ను గిలిగింతలు పెట్టించేందుకు.. ఆబాలగోపాలాన్ని కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమవుతున్న కామెడీ సినిమాలు!! కరోనా మహమ్మారి ప్రభావం తగ్గినప్పటి నుంచి ఇప్పటిదాకా టాలీవుడ్ లో యాక్షన్ సినిమాలే ఎక్కువగా విడుదలయ్యాయి. ఇప్పుడు ప్రేక్షకులు మార్పును కోరుకుంటున్నారు. కామెడీని పండించే సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మార్పుకు అనుగుణంగా సినిమా నిర్మాణ సంస్థలు, హీరోలు కథలను ఎన్నుకుంటున్నారు. ఈక్రమంలోనే నాని, గోపీచంద్ వంటి హీరోలు కామెడీ జానర్ మూవీస్ తో మన ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. కామెడీకి జనం బ్రహ్మరథం పడుతున్నారు అనేందుకు మే 27న (శుక్రవారం) విడుదలైన ‘ఎఫ్3’ మూవీ ఒక నిదర్శనం. ఆ సినిమా హిట్ టాక్ ను సాధించి శభాష్ అనిపించింది. ప్రేక్షకులు కోరుకునే మార్పుతో వచ్చే సినిమాలకు తప్పకుండా ఆదరణ లభిస్తుందని నిరూపించింది.  ఎఫ్3 సినిమా తొలి రోజు దాదాపు రూ.10.35 కోట్లు వసూలు చేసింది. ఇందులో అత్యధికంగా రూ.4 కోట్లు నైజాం ఏరియా, రూ.1.26 కోట్లు సీడెడ్ నుంచి, రూ.1.18 కోట్లు ఉత్తరాంధ్ర నుంచి వచ్చాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, బ్రిటన్ సహా పలు  విదేశాల్లోనూ మంచి కలెక్షన్లే జరిగాయి. ఈ మూవీకి మొత్తంగా  రెండు రోజుల్లో రూ.63.82 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరగడం విశేషం. 


సునీల్ కు ఆఫర్ల వెల్లువ..

కామెడీ చిత్రాలకు చిరునామాగా పేరుపొందిన అల్లరి నరేశ్ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమాతో తెరపై కనిపించేందుకు సమాయత్తం అవుతున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను ఇటీవలె విడుదల చేశారు. ఇందులో అల్లరి నరేశ్ పోషించిన  పాత్ర ఏమిటి ? ఇతర నటీనటులు ఎవరు ? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచిచూడాల్సిందే. కామెడీ పండించడంలో దిట్ట హీరో సునీల్. ‘పుష్ప’, ‘ఎఫ్3’ సినిమాల్లో తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రధానంగా ‘పుష్ప’ సినిమాతో ఆయన కు బాలీవుడ్ లోనూ మంచి పేరొచ్చింది. ఈనేపథ్యంలో ఇప్పుడు బాలీవుడ్ నుంచి కూడా ఆయనకు ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది.  రాంచరణ్ తేజ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమాలోనూ సునీల్ కీలక పాత్రను పోషిస్తున్నారట.

ఆ రిలీజ్ డేట్ లు..

 నాని నటించిన ‘అంటే.. సుందరానికీ’ సినిమా జూన్ 10న విడుదల కానుంది. గోపీచంద్ నటించిన ‘పక్కా కమర్షియల్’మూవీ జూలై 1న రిలీజ్ కాబోతోంది. నాగశౌర్య నటించిన కృష్ణ వ్రింద విహారి సినిమా తొందర్లో రిలీజ్ కు రెడీ అవుతోంది. హీరో కిరణ్ అబ్బవరం నటించిన సమ్మతమే మూవీ జూన్ 24న థియేటర్లలో విడుదల కానుంది. మరోవైపు విజయ్ దేవరకొండ,విశ్వక్ సేన్ ,సుధీర్ బాబు లాంటి హీరోలు కూడా ఎంటర్టైన్ చేయటానికి రెడీ  అవుతున్నారు. ప్రస్తుతం వీరి సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

మరిన్ని వార్తలు.. 

దీపిక..డ్రెస్సింగ్ సెన్స్

కేసీఆర్ కు కౌంటర్ గానే.. నాడు వైఎస్ఆర్ వ్యాఖ్యలు!!