ఐపీఎల్ తో పోటీ : ఒక్క బాల్ కు 286 పరుగులు..కీరోల్ ప్లే చేసిన చెట్టు

ప్రపంచ క్రికెట్ చరిత్రలో 1800సంవత్సరంలో జరిగిన ఓ వన్డే మ్యాచ్ గురించి వింటేనే నవ్వొస్తుంది. కామన్వెల్త్ గేమ్స్ ఉన్నప్పటికి ఐపీఎల్ కి సమానంగా ధనవంతులు ఓ క్రికెట్  మ్యాచ్ ను ఆడారు.

1800సంవత్సరంలో జరిగిన ఈ మ్యాచ్ లో  బ్యాట్స్ మెన్ లు ఒక్క బాల్ కు 286 పరుగులు చేయడం ప్రాధాన్యత చోటు చేసుకుంది. ఒకే మ్యాచ్ లో ఒక బాల్ రెండు లేదా మూడు పరుగులు చేయడం గగనం. అలాంటిది ఒకే బాల్ కు 286పరుగులు చేయడం నిజంగా ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది.

ఈ మ్యాచ్ గురించి వినడానికి విచిత్రంగా ఉన్న లండన్ కు చెందిన మాల్ గెజిల్ అనే మీడియా కథనం ప్రకారం ఆస్ట్రేలియాలో జరిగిన వన్డే మ్యాచ్ కు ఓ చెట్టు కీరోల్ ప్లే చేసిందనే చెప్పుకోవాలి. మాల్ గెజిల్ తెలిపిన వివరాల ఆధారంగా విక్టోరియా టీమ్ మరియు  స్క్రాచ్ టీమ్ ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలిసారి బ్యాటింగ్ కు దిగిన విక్టోరియా టీమ్ బ్యాట్స్ మెన్  తొలి బంతిని బలంగా కొట్టడంతో గ్రౌండ్ బయట ఉన్న ఓ చెట్టు కొమ్మలో బంతి ఇరుక్కుపోయింది. దీంతో విక్టోరియా బ్యాట్స్ మెన్లు వికెట్ల మధ్య రన్స్ చేస్తున్నారు. అదే సమయంలో బౌలింగ్ టీమ్ సభ్యులు బంతి పోయినట్లుగా ప్రకటించాలని అంపైర్లను కోరారు. కానీ అంపైర్లు అలా ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. ఎందుకంటే బంతి చెట్టుపై  స్పష్టంగా కనిపిస్తుంది. బంతిపోయిందని ఎలా ప్రకటిస్తామని నిరాకరించారు.

చెట్టు నరికి ఆ బంతిని తీసేందుకు బౌలింగ్ టీం సభ్యులు  ప్రయత్నించారు. కానీ చెట్టు నరికితే ఆ బంతి కింద పడితే క్యాచ్ మిస్సవుతుందని భావించారని తెలుస్తోంది.  కొద్దిసేపటి తరువత ఎవరో రైఫిల్ తో బంతిని టార్గెట్ చేశారు. ఆలోపే బ్యాట్స్ మెన్లు  286 పరుగులు తీశారు.

విక్టోరియా ఈ సమయంలో డిక్లేర్ చేయాలని నిర్ణయించుకుంది, తద్వారా ఇన్నింగ్స్‌ను కేవలం ఒక బంతితో ముగించింది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దీని తరువాత విక్టోరియా ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది.

 

Latest Updates