రండి.. లక్షలాది ప్రజల జీవితాలను మారుద్దాం

న్యూఢిల్లీ: దేశ ప్రజల జీవితాల్లో అనూహ్య మార్పులు తీసుకొచ్చే స్టార్టప్‌‌లను సృష్టించాలని యువతకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఐఐటీ-ఖరగ్‌‌పూర్‌ 66వ వార్షికోత్సవంలో మోడీ వర్చువల్‌‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆత్మనిర్భర్ భారత్‌‌లో ఐఐటీ గ్రాడ్యుయేట్‌‌లు చాలా కీలకమన్నారు. వర్తమానంపై దృష్టిపెడుతూ భవిష్యత్ అవసరాలను గుర్తిస్తూ ముందుకెళ్లాలని గ్రాడ్యుయేట్లకు సూచించారు. ప్రస్తుత ప్రపంచ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. దేశ ఎకోసిస్టమ్‌‌కు తగ్గట్లుగా కొత్త నాయకత్వం ఉద్భవించాల్సిన అవసరం ఉందన్నారు. అద్భుతమైన స్టార్టప్‌‌లతో లక్షలాది ప్రజల జీవితాలను మార్చేందుకు యత్నించాలన్నారు.

Latest Updates