వరల్డ్‌‌ కప్‌ కౌంట్‌ డౌన్‌ : వంద రోజుల్లో వన్డే వార్‌

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వరల్డ్ కప్ కు ఇవాళ్టితో సరిగ్గా వంద రోజులే ఉంది.మెచ్చిన సమరం.. క్రికెట్‌ జగత్తును మైమరిపించే సంగ్రామం..ప్రతి క్రికెటర్‌ కలల టోర్నమెంట్..నాలుగేళ్లకోసారి జరిగే వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌ మళ్లీ మనముందుకొస్తోంది..! 1975లో మొదలై అప్రతిహతంగా సాగుతున్న మెగా టోర్నీ మరో వంద రోజుల్లో మొదలవబోతోంది..! క్రికెట్‌ పుట్టినిల్లు… తొలి టోర్నీ జరిగిన ఇంగ్లండ్‌ గడ్డపై మే 30వ తేదీన పన్నెండో ప్రపంచకప్‌ ప్రారంభం కాబోతోంది..! టీమిండియా సహా పది దేశాలు ఈ ‘వరల్డ్‌‌‌‌‌‌‌‌ వార్‌ ’ కోసం అస్త్రా లు సిద్ధం చేసుకుంటున్నాయి..!

ఆ సంగ్రామం జరుగుతుం టే..అభిమానులకు పండగే..తమ జట్టు ప్రత్యర్థు లపై దండెత్తు తుంటే..బ్యాట్స్‌ మెన్‌ పరుగులు దోచేస్తుం టే.. బౌలర్లు వికెట్ల నడ్డి విరిచేస్తుంటే..ఫీల్డర్లు మైదానంలో చిరుతల్లా కదులుతుంటే చూసేందుకు రెండు కళ్లూ చాలవు..!ప్రాణాలు పోయినా ప్రపంచకప్‌ పట్టేయాల్సిందే అంటూ క్రికెటర్లు గర్జిస్తుం టే..కప్పు కొట్టి సగర్వంగా తలెత్తు కుంటే ఆ కళ్లు చెమర్చుతాయి..! యాభై ఓవర్ల ఆటలో అత్యుత్తమ సమరాలన్నీ వారికి వీనుల విం దే..!. అలాంటి వందల జ్ఞాపకాలు ఒకేసారి అందించే వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌ కోసం మరో వంద రోజులు నిరీక్షించాలి మనం..! ఒక్కోసారి ఇష్టమైన వాటి కోసం ఎదురుచూపుల్లోనూ ఆనందమే కదా..! లెట్స్‌ వెయిట్‌‌‌‌‌‌‌‌ ఫర్‌ హండ్రెడ్‌ డేస్‌!.

 

Latest Updates