క్రికెట్ బాల్స్ ను డిసిన్ ఫెక్ట్ చేస్తాం

ఐసీసీని పర్మిషన్ కోరనున్న క్రికెట్ ఆస్ట్రేలియా

మెల్ బోర్న్: క్రికెట్ మ్యాచ్ బాల్స్ పై క్రిమి సంహారాకాలు (డిసిన్ ఫెక్టంట్స్) ను వాడటానికి తమకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఐసీసీని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కోరనుంది. దీని ద్వారా ప్లేయర్ల హెల్త్ రిస్క్ మీద ఓ అవగాహనకు రావొచ్చని సీఏ భావిస్తోంది. క్రికెట్ ఆస్ట్రేలియా స్పోర్ట్స్ సైన్స్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ మేనేజర్ అలెక్స్ కౌంటౌరిస్ దీనిపై స్పందించారు. ప్లేయర్స్ సేఫ్ గా తిరిగి ట్రెయినింగ్ మొదలుపెట్టి కాంపిటీటివ్ క్రికెట్ ఆడటం ఈ ఏడాది తర్వాతే సాధ్యమని అలెక్స్ చెప్పారు. ‘బాల్ ను డిసిన్ ఫెక్ట్ చేయడం పరిశీలనలో ఉంది. దీనికి కావాల్సిన అనుమతుల గురించి ఐసీసీతో మాట్లాడాల్సి ఉంది. చాలా విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. బాల్ లెదర్ తో తయారు చేసింది కాబట్టి దాన్ని డిసిన్ ఫెక్ట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే దానిపై మూలలు, పగుళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. క్రిమి సంహారం చేసిన బాల్ ను ఎలా అనుమతిస్తారో, అది ఎలా పని చేస్తుందో తెలీదు. కానీ అది కచ్చితంగా పరిశీలనలో ఉంది. ప్రతీ విషయాన్ని ఇప్పుడు పరిగణిస్తారు. మిగిలిన దేశాలు మా కంటే ముందే క్రికెట్ ఆడటం మొదలుపెడతాయి అనుకుంటా. దీని వల్ల అది ఎలా పని చేస్తుందనే దానికి సంబంధించి వేరే కంట్రీస్ తోపాటు ఐసీసీతో చర్చించడానికి మాకు వీలు లభిస్తుంది’ అని అలెక్స్ కౌంటౌరిస్ చెప్పారు.

Latest Updates