బెట్టింగ్ భూతానికి యువకుడు బలి

ఇబ్రహీంపట్నం , వెలుగు: బెట్టింగ్ డబ్బులు చెల్లించలేక లేక మనస్తాపంతో డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. రంగారెడ్డి జిల్లా తుర్కయం జాల్ మున్సి పాలిటీలోని శ్రీరాంనగర్ కాలనీలో ఉండే పలుస దాసుగౌడ్ పెద్దకుమారుడు అఖిల్ గౌడ్ (20) బీఎస్సీ చదువుతున్నాడు. బెట్టింగ్ కు పాల్పడి చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వలేక వారం రోజులుగా మనస్తాపంతో ఉన్నట్టు తెలుస్తోంది. సోమవారం అందరితో కలిసి భోజనం చేసి పడుకున్న వ్యక్తి తెల్లారేసరికి ఫ్యాన్ కు చీరతో ఉరేసుకుని కనిపించాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పా రు.

Latest Updates