బెట్టింగ్ కేసులో 5 లక్షల లంచం డిమాండ్: కామారెడ్డి టౌన్ సీఐ అరెస్ట్

ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కేసులో 5 లక్షల లంచం డిమాండ్ చేసినందుకు కామారెడ్డి టౌన్ సీఐ జగదీశ్ ను అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు జగదీశ్ ఆఫీసుతో పాటు ఇంట్లో  సోదాలు చేశారు. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అర్ధరాత్రి సీఐ జగదీశ్ ను అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు.

కామారెడ్డికి చెందిన బత్తుల సుధాకర్ ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కేసులో ఈ నెల 8న అరెస్ట్ అయ్యారు. అతనికి బెయిల్ ఇచ్చేందుకు కామారెడ్డి టౌన్ సీఐ జగదీశ్ 5 లక్షలు లంచం డిమాండ్ చేశారు.  మొదటి వాయిదాగా లక్షా 39 వేల 500 రూపాయలు తీసుకొని అరెస్ట్ చేసిన 8వ తేదీనే జగదీశ్ ను విడుదల చేశారు. మిగిలిన నగదు కోసం సీఐ వేధించారు. దీంతో సుధాకర్ ఈ నెల 19న ఏసీబీకి ఫిర్యాదు చేశారు.

ఏసీబీ దాడులు జరుగుతున్నా మారని పోలీసులు

Latest Updates