హైదరాబాద్ లో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

హైదరాబాద్: ఐపీఎల్ మ్యాచ్ లకు బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు టాస్స్ ఫోర్స్ పోలీసులు.  చిలుకలగూడలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 3 టీమ్స్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఈ కేసుకు సంబంధించి బుకీలైన సాయి ప్రసాద్, జియా ఉద్దీన్, ఇస్మాయిల్ ను అరెస్ట్ చేయగా..పరారీలో ప్రధాన బుకీ జాక్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు పోలీసులు.

ఆన్ లైన్ ద్వారా ఐపీఎల్ మ్యాచ్ లకు సంబంధించి క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్నారని తెలిపారు పోలీసులు. ఆన్ లైన్ బెట్టింగ్ పోర్టల్ ను క్రియేట్ చేసిన నిందితులు..బెట్టింగ్ లో పాల్గొంటున్న అందరికి ఐడి, పాస్ వర్డ్ లను ఇస్తున్నారని తెలిపారు. ఆన్ లైన్ లో బాల్ టూ బాల్ పై బెట్టింగ్ నిర్వహిస్తున్నారని తెలిపారు. వారి దగ్గరి నుంచి మొబైల్స్,  34 వేల నగదు, ఐడి కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.

 

Latest Updates