హర్భజన్‌‌ సింగ్ హీరోగా.. బిగ్‌‌బాస్ కంటెస్టెంట్ హీరోయిన్‌గా..

టీమిండియా ఆఫ్‌‌ స్పిన్నర్‌‌ హర్భజన్‌‌ సింగ్‌‌ నటుడిగా కొత్త అవతారం ఎత్తాడు.  జాన్‌‌ పాల్‌‌ రాజ్‌‌, శ్యామ్‌‌ సూర్యల దర్శకత్వంలో అతడు హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ఫ్రెండ్‌‌ షిప్‌‌’.తమిళ బిగ్‌‌బాస్‌‌ ఫేమ్‌‌ లోస్లియా హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని జేపీఆర్‌‌, స్టాలిన్‌‌లు నిర్మిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.  రీసెంట్​గా ఈ మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్​ని యూనిట్ విడుదల చేసింది. బ్యాగ్రౌండ్​లో  లైబ్రరీ హాల్​ను చూపిస్తూ హర్భజన్, అర్జున్​లతో పాటు లోస్లియా లుక్ కూడా రివీల్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని కలిగించేలా ఉంది.  అర్జున్‌‌తో పాటు తమిళ నటుడు సతీష్‌‌ కూడా ఈ మూవీలో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని పలు భార‌‌తీయ‌‌ భాషల్లో విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

For More News..

ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో ఒక్క పోస్ట్‌తో కోటీ 21 లక్షల ఆదాయం

50 ప్లేట్ల పూరీ ఆర్డర్ ఇచ్చి రూ.25 వేలు కొట్టేసిన్రు

ఈసారి బోనాల పండుగ లేనట్లే

Latest Updates