సౌత్​ హీరోయిన్​తో మనీష్ పాండే పెళ్లి

టీమిండియా బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌ మనీశ్‌‌‌‌ పాండే త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. సౌతిండియానటి అశ్రితా షెట్టిని వచ్చే డిసెంబర్‌‌‌‌లో వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. కుటుంబసభ్యులు,  సన్నిహితుల మధ్య డిసెంబర్‌‌‌‌ 2న  పెళ్లి వేడుక జరగనున్నట్టు ఓ ఇంగ్లిష్​ పత్రిక తెలిపింది. ఈ పెళ్లికి టీమిండియా మెంబర్లు కూడా హాజరవనున్నారట. అదేరోజు ముంబైలో వెస్టిండీస్‌‌‌‌తో టీ20 మ్యాచ్‌‌‌‌ ముగిశాక ఈ పెళ్లిలో వారంతా పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్‌‌‌‌ హజారే టోర్నీలో కర్నాటకకు సారథ్యం వహిస్తున్న పాండే.. గత కొంతకాలంగా టీమిండియాలో చోటు కోసం పోరాడుతున్నాడు. మరోవైపు కన్నడ, తమిళ సినిమాల్లో అశ్రిత యాక్ట్‌‌‌‌ చేసింది.

Latest Updates