టెస్ట్‌ ఓపెనర్‌గా రోహిత్‌!

న్యూఢిల్లీ : టీమిండియా వన్డే టీమ్‌‌ వైస్‌‌ కెప్టెన్‌‌ రోహిత్‌‌ శర్మను టెస్టుల్లో ఓపెనర్‌‌గా పంపించే అవకాశాలపై చర్చిస్తామని సెలెక్షన్‌‌ కమిటీ చైర్మన్‌‌ ఎమ్మెస్కే ప్రసాద్‌‌ తెలిపాడు. ఓపెనర్‌‌ లోకేశ్‌‌ రాహుల్‌‌ ఫామ్‌‌ను పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుతం టెస్ట్‌‌ల్లో మిడిలార్డర్‌‌లో ఆడుతున్న రోహిత్‌‌కు ప్రమోషన్‌‌ ఖాయం. రోహిత్‌‌ను టెస్ట్‌‌ల్లో ఓపెనింగ్‌‌కు పంపాలని మాజీ కెప్టెన్‌‌ సౌరవ్‌‌ గంగూలీ కూడా ఇటీవల సూచించాడు. వన్డే, టీ20ల్లో ఇన్నింగ్స్‌‌ ఆరంభిస్తున్న రోహిత్‌‌కు టెస్ట్‌‌ల్లో స్థానంపై ఎమ్మెస్కే మాట్లాడుతూ.. వెస్టిండీస్‌‌ టూర్‌‌ తర్వాత ఇప్పటిదాకా కమిటీ సమావేశం కాలేదు. వచ్చే మీటింగ్‌‌లో రోహిత్‌‌ను ఓపెనింగ్‌‌కు పంపే అంశంపై తప్పకుండా చర్చిస్తాం అని తెలిపాడు.  కేఎల్‌‌ రాహుల్‌‌ ప్రస్తుతం ఫామ్‌‌ కోసం తంటాలు పడుతున్నాడని, అతనిని కమిటీ పరిశీలిస్తుందన్న ఎమ్మెస్కే అతను వీలైనంత త్వరలో టచ్‌‌లోకి రావాలన్నాడు. టీ20 వరల్డ్‌‌కప్‌‌ సన్నాహకాల్లో భాగంగానే  కుల్దీప్‌‌, చహల్‌‌ను పక్కనపెట్టి రాహుల్‌‌ చహర్‌‌, వాషింగ్టన్‌‌ సుందర్‌‌ను సౌతాఫ్రికా సిరీస్‌‌కు ఎంపిక చేశామని ప్రసాద్‌‌ చెప్పాడు.

Latest Updates