క్రికెటర్లు .. బుకీలతో జాగ్రత్త!

న్యూఢిల్లీ: లాక్‌‌డౌన్‌‌తో ఇళ్ల‌కే పరిమితమైన క్రికెటర్ల‌కు బుకీలతో ప్రమాదం పొంచి ఉందని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఏసీయూ హెచ్చరించింది. టైమ్‌‌పాస్‌ కోసం ఎక్కువసేపు సోషల్ మీడియాలో గడిపే ప్లేయరతో పరిచయాలు పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని వెల్లడించింది. ‘గతంలో కంటే సోషల్‌‌మీడియాలో ప్లేయర్ల యాక్టివిటీ క్టి పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఆటలు నిలిచిపోయినా.. బుకీలు మాత్రంచాలా చురుకుగా ఉన్నారు. రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మెల్లగా మాటలు, సంప్రదింపులతో రిలేషన్‌‌పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఫ్యూచర్‌‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌‌ చేసేలా ఇప్పట్నించే ప్లాన్స్‌ వేస్తున్నారు. కాబట్టి ప్లేయర్లు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది’ అని ఏసీయూ చీఫ్‌ అలెక్స్‌‌మార్ష‌ల్ వెల్లడించారు.

మ్యాచ్‌లు లేకపోవడంతో క్రికెటర్ల ఇన్‌‌కమ్‌ సోర్స్ తగ్గిపోకుండ‌ కూడా ఫిక్సర్ల‌కు అనుకూలంగా మారుతుందన్నారు. బుకీల విషయంపై బీసీసీఐ ఏసీయూ అజిత్‌ సింగ్‌‌ కూడా
స్పందించారు. అనుమానాస్పదంగా తోచిన ప్రతి అంశాన్ని వెంటనే తమ దృష్టికి ష్టి తీసుకురావాలని
క్రికెటర్ల‌కు సూచించారు. కొంత మంది బుకీలు ఫేక్‌ ఐడీలతో ఇబ్బందులు సృష్టిస్తారని, అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. ఫిక్సర్స్‌‌, బుకీలు ఎలా సంప్రదిస్తారో క్రికెటర్ల‌కు వెల్లడించారు. ఫ్యాన్స్‌ రూపంలో వచ్చే ఫేక్‌‌మెయిల్స్‌‌, చాట్స్‌‌ను, ఇతరత్రా అంశాలను నమ్మొద్దన్నారు.

Latest Updates