డ్రగ్‌ కేసు: వివెక్‌ ఒబెరాయ్‌ భార్యకు BCCB నోటీసులు

బాలీవుడ్‌తో పాటు శాండల్‌వుడ్‌ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం కేసు కలకలం రేపుతోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు కన్నడ నటీనటులు అరెస్టై జైలుకు వెళ్లారు. ఈ కేసులో భాగంగా ప్రముఖ బాలీవుడ్‌ నటుడు వివేక్ ఒబెరాయ్ నివాసంలో బుధవారం బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(BCCB) అధికారులు తనిఖీలు నిర్వహించారు. అంతేకాదు… ఆయన భార్య ప్రియాంక అల్వా ఒబెరాయ్‌కు క్రైం బ్రాంచ్‌ ఇవాళ( శుక్రవారం) నోటీసులు జారీ చేసింది. అయితే డ్రగ్‌ కేసులో కర్ణాటక మాజీ దివంగత మంత్రి జీవరాజ్‌ అల్వా కుమారుడు అదిత్య అల్వా నిందితుడిగా ఉన్నాడు.

ఆదిత్య అల్వా స్వయంగా ప్రియాంక అల్వా సోదరుడు, వివేక్ కు బావమరిది కావడంతో పోలీసులు ఆయన ఇంటిలో తనిఖీ చేసినట్లు తెలిసింది. అయితే ఆదిత్య పరారీ ఉండటంతో ఆచూకి కోసం శుక్రవారం ప్రియాంకను పోలీసులు విచారించనున్నట్లు తెలుస్తోంది.

Latest Updates